వడ్లూరి విజయకుమార్ ఆధ్వర్యంలో వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు
- అన్నదాన కార్యక్రమం, పండ్ల పంపిణీ
హుజురాబాద్, జులై 22 (జనవిజయం):
మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్ (బ్రహ్మచారి) ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను హుజురాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి సుమారు వెయ్యి మందికి అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ బోయినపల్లి వినోద్ కుమార్ ఎల్లప్పుడూ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి, వారి సమస్యలు ఎప్పటికప్పుడు, పరిష్కరిస్తూ, తన వద్దకు సహాయం కోసం ఎవరు వచ్చిన వారికి సహకరిస్తూ, సేవా భావమే జీవిత లక్ష్యంగా ఎంచుకున్న వినోద్ కుమార్ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండి రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. కరీంనగర్ ఎంపీగా జిల్లా ప్రజలకు ఎనలేని సేవలు అందించిన వినోద్ కుమార్ రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవాలన్నారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఆపదలో ఆదుకునే వినోద్ కుమార్ నిండా నూరేళ్లు ఆయురారోగ్యాలతో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని భగవంతుని వేడుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల, కౌన్సిలర్లు బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.