పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు…….వికాస తరంగిణి
భద్రాచలం టౌన్,ఏప్రిల్ 22(జి.నాగేశ్వరవు:జనవిజయం)
ఈ రోజు ధరిత్రి దినోత్సవ సందర్భంగా వికాస తరంగిణి భద్రాచలం శాఖ ఆధ్వర్యంలో పర్యా వరణ పరిరక్షణ, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటూ సుమారు 200 మంది తో పుర వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని డాక్టర్ జయభారతి ప్రారంభించారు. వికాస తరంగిణి , జీయర్ మఠం బాధ్యులు కమలా రాజ శేఖర్, వెంకటాచారీ, భూపతి రావు, దేసప్ప, రంగారెడ్డి, యశోద రాంబాబు, తాళ్ళపుడి రాము, జి.నాగేశ్వరరావు, చారు గుల్ల శ్రీనివాస్, కామేశ్వర రావు, సీతా మహాలక్ష్మి ఇంకా మహిళా కార్య కర్తలు పాల్గొన్నారు.