ఖమ్మం,జూలై 27 (జనవిజయం):
స్థానిక మంచి కంటి భవనం నందు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగ నియామకాల్లో శారీరక వికలాంగుల రోస్టర్ పాయింట్లు 10 లోపు తగ్గించాలని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రెషన్ కార్డులు మంజూరు చేయాలని ఎన్.పి.ఆర్.డి. ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌస్ డిమాండ్ చేశారు. అదే విధంగా ఎన్.పి.ఆర్.డి. ఖమ్మం జిల్లా అధ్యక్షులు దొన్వాన్ నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 10.48 లక్షల మంది వికలాంగులు ఉన్నారు. 2016 చట్టం గుర్తించిన 21 రకాలుగా దివ్యాంగులను గుర్తించడం జరిగింది. శారీరక అంగవైకల్యం కలిగిన దివ్యాంగులకు 5% రిజర్వేషన్ కల్పించాలని, దివ్యాంగుల జీవనోపాధికి గాను 10 లక్షల రూపాయలు లోన్ సదుపాయం కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎం. లక్ష్మణ్, ఎస్.కె. యాకూబ్, ఎస్.ఉపేందర్, దొన్వాన్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.