జనవిజయంజాతీయంసిఎం పీఠంపై వరుసగా రెండోసారి విజయన్‌

సిఎం పీఠంపై వరుసగా రెండోసారి విజయన్‌

  • మంత్రులుగా అందరూ కొత్త వారే
  • అత్యంత నిరాడంబరంగా ప్రమాణస్వీకారం
  • చరిత్ర తిరగరాసిన విజయన్
  • ఆరోగ్య శాఖమంత్రిగా జర్నలిస్ట్ వీణ జార్జ్‌ 

తిరువనంతపురం,మే20(జనవిజయం): కేరళ ముఖ్యమంత్రిగా సీపీఎం సీనియర్‌ నేత పినరయి విజయన్‌ వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. కొవిడ్‌ ప్రొటోకాల్‌ను అనుసరించి అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో విజయన్‌ చేత గవర్నర్‌ అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ ప్రమాణం చేయించారు. 76 ఏళ్ల విజయన్‌ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్‌ను వరుసగా రెండోసారి విజయతీరాలకు చేర్చి చరిత్ర సృష్టించారు. కేరళ ముఖ్యమంత్రిగా విజయన్‌ బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌- యూడీఎఫ్‌ నేతలు సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి కొద్దిమంది మాత్రమే హాజరు కావాలంటూ నిన్న కేరళ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇకపోతే కేకే శైలజ స్థానంలో వీణ జార్జ్‌ కేరళ ఆరోగ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జర్నలిస్ట్‌ స్థాయి నుంచి రాజకీయ నాయకురాలిగా ఎదిగారు. వీణ జార్జ్‌ కేరళ ఆరోగ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పదవి గతంలో కెకె శైలజా నిర్వహించారు. తిరువనంతపురంలోని సెంట్రల్‌ స్టేడియంలో గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. అటవీ మంత్రిత్వ శాఖ అప్పగించిన ఎకె ససీంద్రన్‌ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా విజయన్‌తో పాటు 21 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక పినరయి విజయన్‌ అల్లుడు మహ్మద్‌ రియాస్‌కు పబ్లిక్‌ అండ్‌ టూరింజ్‌ శాఖను అప్పగించారు. ఇక కేబినెట్‌లో చేరిన వారంతా కొత్తవారే కావడం విశేషం. ఈ సందర్భంగా సీఎం విజయన్‌తో పాటు మంత్రులకు గవర్నర్‌, ఇతర ప్రముఖలు శుభాకాంక్షలు తెలిపారు. మే2న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలోని మొత్తం 140 సీట్లకు గాను, 99 సీట్లను ఎల్డీఎఫ్‌ కైవసం చేసుకుంది. ప్రతిపక్ష యూడీఎఫ్‌ 41 స్థానాల్లో గెలుపొందింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ రెండోసారి గెలవదనే సంప్రదాయాన్ని చెరిపేసిన విజయన్‌ నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ 40 ఏళ్ల చరిత్రను తిరగరాసి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి