- మెజిస్ట్రేట్ వెంకటేశ్వర్లు
భద్రాచలం, జూలై 18 (జనవిజయం):
విద్యార్థులు రోజువారీ చదువు తో పాటు రాజ్యాంగం, చట్టాలు పై అవగాహన కలిగి ఉండాలని స్థానిక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వెంకటేశ్వర్లు సూచించారు. స్థానిక మారుతి నర్సింగ్ కళాశాల లో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిధి గా పాల్గొన్న మెజిస్ట్రేట్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్దులకు చట్ట, న్యాయ పరమైన విజ్ఞానం చాలా అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోట దేవదానం, సి ఐ నాగరాజు రెడ్డి, మారుతి నర్సింగ్ కళాశాల ఛైర్మన్ డాక్టర్ ఎస్ ఎల్ కాంతారావు, న్యాయవాదులు పి, తిరుమల రావు, పి. తరుణి, ఎస్.నర్మద, ప్రసాద్, సురేష్, మండల లీగల్ సర్వీసెస్ సిబ్బంది, ఉబ్బానీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.