Saturday, February 24, 2024
Homeరాజకీయంవిద్యారంగంలో పివి సంస్కరణలు

విద్యారంగంలో పివి సంస్కరణలు

  •  నవోదయ విద్యాలయాలకు అంకురార్పణ

హైదరాబాద్‌,ఫిబ్రవరి9(జనవిజయం):

రాజీవ్‌ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో జాతీయ విద్యా విధానం రూపొందించిన మహా విద్యావేత్త మన  పివి నరసింహారావు. ఒక విద్యావేత్తగా తత్త్వవేత్తగా, ఆర్థిక వేత్తగా, సామాజిక వేత్తగా, రాజకీయవేత్తగా, భాషావేత్తగా, అభ్యుదయ వేత్తగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశీలిగా పీవీ ఘనమైన చరిత్ర కలిగిన మహాను భావుడు. అందుకే తనకు ఏ మంత్రిపదవి అప్పగించినా అందులో రాటుదేలడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే నవోదయ విద్యావిధానం ఆయన బుర్రలోంచి బయటకు వచ్చింది.  పివి నర్సింహారావు కేంద్రంలో మానవ వనరుల మంత్రిగా ఉన్నప్పుడు విద్యారంగానికి ఎనలేని సేవలు అందించారు. అనేక కార్యక్రమాలను అమలు చేశారు. పీవీ మేధో సంపత్తి గురించి ఆయనను అనుసరించిన వారందరికీ తెలుసు. ఎప్పుడూ సమాజం గురించి ఆలోచించే దార్శనికుడని ఆయనతో పనిచేసిన వారు ఎదుగుదురు.  అందుకే ఆయన నవోదయాలను తమకూ కావాలని ఇప్పటికీ అనేక రాష్టాల్రు కోరుతున్నాయి. ఉమ్మడి అంధ్రప్రదేశ్‌లో విద్యాశాఖ మంత్రిగా పేదలకు రెసిడెన్షియల్‌ విద్యావ్యవస్థను తొలిసారిగా పరిచయం చేసిన ఘనత ఆయనదే.  అందులో నవోదయ విద్యాలయాల  ఏర్పాటు కూడా ఒకటి. ఇప్పుడు నవోదయలో చదివిన విద్యార్థులు అన్నిరంగాల్లో రాటుదేలుతున్నారు. దీనిని జాతీయస్థాయిలో ప్రవేశ పెట్టిన ఘనత కూడా ఆయనదే.

ఇందిరా గాంధీ, ప్రాచీన గ్రీకు తాత్వికుడు ప్లేటో చెప్పినట్లు  తత్త్వవేత్తలే పాలనలో న్యాయాన్ని ధర్మాన్ని సమానంగా స్వీకరిస్తారని  అంటారు. గీతాచార్యుడు కూడా అలగా అంటాడు. స్థితప్రజ్ఞత ఉంటే ఏదైనా సాధించగలరని. అర్థశాస్త్ర రచయిత కౌటిల్యుడి అభిప్రాయం ప్రకారం మంచి, చెడు రెండిరటినీ ఒకే కోణంలో చూసినప్పుడు మంచి నాయకుడు కాగలడు.  ఆయన రూపకల్పన చేసిన ప్రైవేటీకరణ, ఆర్థిక సరళీకరణ విధానాలను తదనంతర ప్రభుత్వాలు కొనసాగించలేకపోయాయి.  సమైక్య ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, యాభై సంవత్సరాల క్రితం భూసంస్కరణలను ప్రవేశపెట్టిన ఘనత పీవీ సొంతం. పీవీ తీసుకువచ్చిన భూసంస్కరణలు భూస్వామ్య వ్యవస్థను సమూలంగా నిర్మూలించడానికి బాటలు వేశాయి.  భూమిలేని పేదలు చిన్న`చిన్న కమతాల యజమానులుగా మారడానికి సహాయపడ్డాయి. పేద వారికి సమాజంలో గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి. దున్నేవారికే భూమి ఎందుకు ఇవ్వాలో పీవీ సవివరంగా తెలియచెప్పారు. రాజకీయాల నుండి దాదాపు తప్పుకుంటున్న దశలో  అనుకోకుండానే పివి ప్రధాని అయ్యారు. నెహ్రూ`గాంధీల కుటుంబానికి చెందని, పూర్తి అయిదు సంవత్సరాల పాటు ప్రధానిగా పనిచేసిన మొదటి వ్యక్తి పీవీ. తీరికలేని రాజకీయ కార్యకలాపాలు ఉన్నప్పటికీ, అన్ని భాషలలోని ప్రముఖ రచయితలతో పీవీ క్రమం తప్పకుండా సంబంధాలు కొనసాగించారు. ఆయన 18 భాషలలో నిష్ణాతులు. స్థితప్రజ్ఞతకి, మూర్తీభవించిన వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం. పి.వి ఎంత ఎదిగినా, ఎంత పాండితీవిభవ సంపన్నులైనా వినమ్రత ఆయన సొత్తు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments