బోనకల్ ఎస్సై బి సాయికుమార్
బోనకల్, జూలై 15 (జనవిజయం) :
శాంతిభద్రతలను కాపాడటానికి పోలీస్ శాఖ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తుందని,శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై బోల్లేద్దు సాయి కుమార్ అన్నారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ మాట్లాడుతూ వాట్సాప్ గ్రూపుల్లో వ్యక్తిగత,రాజకీయ గొడవలు రెచ్చగొట్టేలా ప్రేరిపితం చేయరాదని అన్నారు.మండల పరిధిలోని గ్రామాల్లో రాజకీయ లేదా సాధారణ హింసకు తావు లేకుండా ప్రజలు శాంతియుతంగా ఉండాలని సూచించారు.అలాగే మండల కేంద్రం గుండా అక్రమ ఇసుక,మట్టి నడపకూడదని హెచ్చరించారు.నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని,ఒక వేళ అలా ఎవరైనా డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఆర్ఓబి రోడ్డుకి ఇరువైపులా అడ్డంగా దుకాణాలు లేదా ఇతర వాహనాలు పార్కింగ్ స్థలంలో మాత్రమే ఉంచాలని,నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఏదైనా విశ్వసనీయ సమచారం తెలిస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు.పోలీసులు,ప్రభుత్వ అధికారులు/అధికారులు చట్టపరమైన విధులను నిర్వర్తించేటప్పుడు వారిని అడ్డుకోరాదని అలా ఎవరైనా చెస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.వాట్సాప్,ఇతర పబ్లిక్ గ్రూప్‌లలో రెచ్చగొట్టడం,బెదిరించడం లాంటి చర్యలకు దూరంగా ఉండాలని యువతకు సూచనలిచ్చారు.