భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 18 (జనవిజయం): గృహలక్ష్మీ పథకానికి వచ్చిన దరఖాస్తులు విచారణ ప్రక్రియ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగాలని జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అధికారులను ఆదేశించారు. శుక్రవారం గృహలక్ష్మీ దరఖాస్తులు విచారణ ప్రక్రియపై రెవెన్యూ, పంచాయతీ రాజ్, మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జలాల్లో ఈ పధకానికి 86,773 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. 17వ తేదీ గురువారం వరకు 51 వేల దరఖాస్తులు విచారణ ప్రక్రియ పూర్తి అయినట్లు చెప్పారు. విచారణలో అర్హుల, అనర్హుల జాబితా జాబితా సిద్ధం చేయాలని చెప్పారు. విచారణ పూర్తి అయిన దరఖాస్తులు ప్రత్యేక టీములు ర్యాన్ డం తనిఖీ చేయాలని చెప్పారు.
ఈ సందర్భంగా మండలాలలో వచ్చిన దరఖాస్తుల విచారణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్నపు రెడ్డిపల్లి మండలంలో విచారణ ప్రక్రియను తహసీల్దార్ ను అడిగి తెలుసుకున్నారు. పథక అమలులో అర్హుల జాబితా ఎంపికలో రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు తప్పని సరిగా పాటించాలని చెప్పారు. వచ్చిన దరఖాస్తుల మేరకు క్షేత్ర స్థాయిలో విచారణ జరగాలని చెప్పారు.
అర్హుల జాబితాను నిర్ణీత ప్రొఫార్మాలో నింపిన తదుపరి ఆన్లైన్ చేయాలని చెప్పారు. ప్రతి రోజు విచారణలో గుర్తించిన అర్హుల, అనర్హుల జాబితా నివేదికలు అందచేయాలని ఆదేశించారు. విచారణ నివేదికలు ప్రత్యేక అధికారులు, ఆర్డిఓలు ధృవీకరణతో అందచేయాలని ఆదేశించారు.
ఈ టెలి కాన్ఫరెన్స్ లో రెవెన్యూ, పంచాయతి రాజ్, మున్సిపల్ కమిషనర్లు కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.