Saturday, February 24, 2024
Homeరాజకీయంవిభజన సమస్యలకు చెల్లుచీటి

విభజన సమస్యలకు చెల్లుచీటి

న్నికలకు మరెంతో సమయం లేదు. గత పదేళ్లుగా విభజన హావిూలు గాలికిపోయాయి. ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. కనీసం అభివృద్ది పనులను ప్రారంభించినా పరిస్థితి వేరుగా ఉండేది. తెలంగాణతో పోలిస్తే ఎపి ఓ రకంగా బాగా నష్టపోయింది. అక్కడ పదేళ్లుగా ఇద్దరు ముఖ్యమంత్రులు మారినా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. కేంద్రాన్ని నిలదీసే స్థితిలో వైఎస్‌ జగన్‌ లేరు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టిన షర్మిల విభజన హావిూలపై గట్టిగానే నిలదీస్తున్నారు. ఎపి విభజన జరిగాక ఇరు రాష్టాల్రకు కేంద్రం నిర్మాణాత్మక సహకారం అందించలేక పోయింది. ఎపి రాజధానిపై కేంద్రం చేతులెత్తేసింది. విశాఖ స్టీల్‌ ఆందోళనలను పట్టించుకోలేదు. కడప ఉక్కును పక్కన పెట్టారు. బయ్యారం ఉక్కు ఊసేలేదు. ఇక ఏంచేశారో చెప్పడానికి బిజెపి వద్ద ఏవిూ లేదు. ఆత్మనిర్భరభారత్‌ పేరుతో మోడీ పదేపదే మాటలు వల్లిస్తున్నా ప్రయోజనం శూన్యం అని తేలింది. కనీసం ఉభయరాష్టాల్ర మధ్య సమస్యలను పట్టించుకోలేదు. ఇప్పటికే కృష్ణా, గోదావరి జలవివాదాన్ని కూడా సత్వరంగా పరిష్కరించాలన్న ఆలోచన ప్రయత్నం చేయడంలేదు. కెఇఆర్‌ఎంబికి ప్రాజెక్టులను అప్పగించుకునే ప్రయత్నం చేస్తోంది.

నీటి వాటాలను సమంగా పంచితే వివాదాలు రావు. ఈ విషయంలో కూడా కేంద్రం పెద్దన్న పాత్ర పోషిండం  లేదు. అలాగే విభజన హావిూలపై మాత్రం కేంద్రం నోరు మెదపడం లేదు. దీనిపై ఈ రెండు రాష్టాల్రు నేరుగానే పోరాడాల్సిన అవసరం వచ్చింది. సమస్యలను నాన్చకుండా త్వరగా పోరాడితేనే మంచిది. ఎన్నికల ముందు అయినా విభజన సమస్యలపై ఇరురాష్టాల్ర నేతలు పోరాడాలి. ఎపిలో మాత్రం నేతలు నిలదీయలేక పోతున్నారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు కేంద్రంతో సయోధ్యతో ఉన్నా కూడా లాభం చేకూరడంలేదు. స్థానిక బిజెపి నేతలు కూడా ఉభయ తెలుగు రాష్టాల్ల్రో సమస్యలు ప్రస్తావించి సాధించే తెలివిని ప్రదర్శించడంలేదు. అక్కడ వైసిపిని, ఇక్కడ కాంగ్రెస్‌ను విమర్శించడంలో స్థానిక బిజెపి నేతలు బిజీగా ఉన్నారు. దూకుడు రాజకీయాలతో, వారు చేస్తున్న విన్యాసాలు అభాసుపాలు చేస్తున్నాయి.

మొత్తంగా విభజన వల్ల తెలంగాణ కొంత పురోగమిస్తున్నా ఎపిలో మాత్రం అలాంటి ఛాయలు కానరావడం లేదు. నాయకత్వలోపం కూడా కారణంగా భావించాలి. దీనికి తోడు ఎపిలో ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా పెద్దగా ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో గత విభజన సమయంలో ఇచ్చిన హావిూలను ముందుకేస్తే అసలు కేంద్రం ఎందుకిలా వ్యవహరించిందో అర్థం కావడంలేదు. విభజన హావిూలు అమలు చేయకుండా కేంద్రం రాష్టాన్రికి ద్రోహం చేసినా  వైసిపి, తెలుగుదేశం పార్టీలు పెద్దగా పోరాడడంలేదు. మోడీ బురిడీ కొట్టించి కాలయాపన చేయడంతో పదేళ్లు గడిపేశారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా కేంద్రం విధానాలపై రాజీపడకుండా ఎపి నేతలు పోరాడలేకపోతున్నారు. ఈ రెండు పార్టీల మధ్య ఉన్న వైరుధ్యాల కారణంగా కేంద్రం లాభపడుతోంది. గతంలో దీర్ఘకాలం బిజెపితో టిడిపి సాగించిన పొత్తు రాజకీయాలు కూడా దీనికి ఒక కారణం. ఇకపోతే అధికారంలోకి రాకముందు జగన్‌ ఇచ్చిన అనేకానేక సమస్యలు ఆచరణకు నోచుకోలేదు. గతంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేయడానికి, మూసేయడానికి వెనకాడలేదు. ఇప్పుడు జగన్‌ మోహన్‌రెడ్డి కూడా అదేపని చేస్తున్నారు. కృష్ణపట్నం జెన్‌కోను రాష్ట్ర ప్రభుత్వం అదానీకి ధారాదత్తం చేసింది. గంగవరం పోర్టును అప్పగించేశారు. సహకార చెక్కర, పాలసంఘాలను రెండు పార్టీలు దెబ్బతీశాయి. అందువల్ల మౌలికమైన ఆర్థిక విధానాలలో ఇద్దరికీ తేడాలేదు. తెలుగు ప్రజల భావోద్రేకాలకు అనుగుణంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను మాటవరసకు వ్యతిరేకిస్తున్నప్పటికీ గట్టిగా నిలబడి తెగువతో పోరాటానికి ముందుకు రావటం లేదు. ప్రత్యేకహోదాను పక్కనపెట్టి ఇద్దరూ కీచులాడుకుంటున్నారు.

ఎన్నికలు వచ్చినప్పుడు సంక్షేమ పథకాలను పోటీలు పడి ప్రకటిస్తుంటారు. ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాటగా వీరి తీరున్నది. నరేంద్రమోదీ నాయకత్వంలో బిజెపి రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చి పదేళ్లు పూర్తికావస్తున్నా తెలుగు రాష్టాల్రకు సంబంధించిన సమస్యలను పరిష్కరించకపోగా పొగపెట్టారు.  ప్రస్తుత సందర్భంలో నరేంద్రమోదీ ఇకముందు ఏదో చేస్తారనో ఆశలు పెట్టుకుంటే అంతే సంగతలు. మళ్లీ ఎన్నికల్లో బిజెపి గెలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి. మోడీని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న ప్రతిపక్షాల భవిష్యత్‌ అగమ్య గోచరంగా మారింది. అప్పటికీ ఇప్పటికీ ఆయన ధోరణి మారలేదు. కేంద్రమంత్రులు ఎందరు ఉన్నా వారంతా డవ్మిూలే. అంతేగాకుండా అంతా నమో అంటూ స్మరించే స్థాయికి చేరుకునేలా చేశారు. తనకంటూ ఒక ప్రత్యేక అభిమాన భక్తగణాన్ని దేశ విదేశాల్లో రూపొందించుకోవడంలోనూ మోడీ విజయం సాధించారు. అందుకే మోదీని తీవ్రంగా విమర్శించే వారిని మించి ఆయనను గుడ్డిగా సమర్థించేవారు ఎక్కువగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి బలం తానే అన్న రీతిలో ఇప్పుడు పార్టీ పరిస్థితి తయారయ్యింది.

మోదీ, ఆయన విధానాల పట్ల వ్యతిరేకత పెరుగుతున్నా దానిని ఆయన లెక్క చేయడం లేదు. ఆర్థిక విధానాలు సవ్యంగా ఉన్నాయని, ధరలు అదుపులో ఉన్నాయని, నిరుద్యోగం నియంత్రణలో ఉన్నదని చెప్పేందుకు  విపరీతమైన ప్రచారాలు వివిధ రూపాల్లో సాగుతున్నాయి. మోదీ నిరంకుశ, ఏకపక్ష విధానాల వల్ల దేశ సమస్యలే కాదు. ఉభయ తెలుగు రాష్టాల్రకు కూడా సవిూప దూరంలో పరిష్కారం అవుతాయనడానికి లేదు. ప్రధానమంత్రి సమాఖ్య స్ఫూర్తితో పనిచేస్తున్నారనడానికి లేదు. రాష్టాల్రను గౌరవిస్తున్నానని చెప్పుకోవడం మినహా వారిని గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాలు ఎప్పుడూ కొనసాగిస్తుంటారు. మోదీ ప్రత్యర్థులను బలహీనపరిచేందుకు కేంద్ర ఏజెన్సీలను అప్పుడప్పుడూ ప్రయోగిస్తూనే ఉంటారు. ఇకముందు కూడా ఇలాగే ఉంటారు.  అలాగే ఉభయ రాష్టాల్ర సమస్యలను కూడా పట్టించుకుంటారన్న నమ్మకం కూడా లేకుండా పోయింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments