వేంసూరు,ఆగస్ట్3(జనవిజయం): మండల నూతన తహశీల్దార్ గా ఏమ్.ఏ.రాజు గురువారం సాయంత్రం విధులు చేపట్టారు. గతంలో పని చేసిన తహశీల్దార్ నారాయణమూర్తి మహబూబబాద్ జిల్లా కు బదిలీపై వెళ్లగా రాజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల తహశీల్దార్ గా పని చేస్తూ వేంసూరు తహశీల్దార్ గా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మండల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ఎలాంటి సమస్యలు ఉన్నా కార్యాలయ పని వేళలో నేరుగా వచ్చి తనను కలసి పరిష్కారం చేసుకోవచ్చని, ఎలాంటి పైరవీకారులను నమ్మి మోసపోవద్దని ఆయన ప్రజలకు సూచించారు. తహశీల్దార్ ఏమ్. ఏ.రాజు ను నాయబ్ తహశీల్దార్ కరుణశ్రీ, గిరిధావర్లు హరిప్రసాద్, చిరంజీవి, సీనియర్ అసిస్టెంట్ దూపకుంట్ల జగదీష్, జూనియర్ అసిస్టెంట్ కిరణ్, అటెండర్స్ జాన్ బీ, ఖాదర్, విఆర్ఏ లు మహేష్, చంటి, లక్ష్మణ్ లు కార్యాలయ మర్యాదలతో స్వాగతం పలికి ఆహ్వానించారు.