జనవిజయంఆరోగ్యంవేలాదిలో ఒక్కడు ఆ డాక్టర్ - హేట్సాప్ ఇమ్మాన్యుయెల్‌ గారూ!

వేలాదిలో ఒక్కడు ఆ డాక్టర్ – హేట్సాప్ ఇమ్మాన్యుయెల్‌ గారూ!

యన పేరు విక్టర్‌ ఇమ్మాన్యుయెల్‌. జనరల్‌ మెడిసిన్‌ స్పెషలైజేషన్‌తో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన డాక్టర్. వివిధ ఆస్పత్రుల్లో పనిచేసిన ఆయన తర్వాత హైదరాబాద్ ఉప్పల్ లోని పీర్జాదిగూడలో సొంతంగా క్లినిక్‌ పెట్టుకున్నారు. తన క్లినిక్ ను ప్రజావైద్యశాలగా నడుపుతున్నారు. నిరుపేదలకు ఉచితంగా, తెల్లకార్డు ఉన్నవారికి 10రూపాయలు, మిగిలినవారికి 200రూపాయలు ఫీజుతో వైద్యం చేస్తున్నారు. లాబ్, మెడిసిన్ లలో కూడా రాయితీలు ఇస్తుండడమే గాక వైద్యం విషయంలో, ఓపిక విషయంలో ఆయన ప్రజల మన్ననలు పొందుతుండం ఇతర వైద్యులకు ఆదర్శం.ఈయనను చూసి నిలువు దోపిడీ చేస్తున్న డాక్టర్లు, కార్పోరేటు ఆసుపత్రుల యజమానులు సిగ్గు తెచ్చుకోవాలి. ఏ కొంతైనా మానవత్వం మిగిలి ఉంటే దానిని బయటకు తీసి కనీసం మనుషులు అనిపించుకోవాలని చెప్పాల్సిన పరిస్థితులలో మనం ఉన్నామనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అన్నింటి కంటే ఖరీదైన సరుకుగా నేడు ప్రయివేటు వైద్యం మారపోయిన నేపథ్యంలో అక్కడక్కడా మానవత్వం ప్రదర్శిస్తున్న మహానుభావులుండడం అభినందనీయం. హాస్పిటల్ కు వెళదామంటే ఆస్తులు అమ్ముకోవలసి వస్తుందని అధికశాతం ప్రజలు భయపడుతున్న ఈ సమయంలో, ముఖ్యంగా కోవిడ్ పేషంట్లు లేదా బాధితులు ఆయనను కనిపించే దేవుడిగా మొక్కుతున్నారు.

కరోనా పేరుతో ప్రయివేటు ఆసుపత్రుల దోపిడీని మరోమాటలో చెప్పాలంటే దందాను ప్రతిరోజూ వార్తలలో చూస్తూనే ఉన్నము. లక్షలలో పైసలు పిండుతూ చివరి పైసా వరకూ వసూలు చేసేంతవరకూ శవాలను సైతం తీసుకుపోనీయని అమానుష పరిస్థితులను కథలుగా వింటున్నాము. తగిన పర్మిషన్లు, వసతులు, భద్రతలు, సిబ్బంది లేకుండా అరకొర వైద్యం, నకిలీ వైద్యం, మోసపూరిత వైద్యం చేస్తున్నవారి గురించి చూస్తున్నాము. మందులను, రెమిడిసివర్ ను బ్లాక్ లో అమ్ముకోవడం, గ్లూకోజు పౌడర్ కలిపి రెమిడిసివర్ అని ఇంజక్షన్ ఇచ్చి రోగలను చంపేస్తున్న కేటువైద్యులను గురించి వింటున్నాము. ఖమ్మంలో నిన్న మూడు ఆసుపత్రులను అధికారులు సీజ్ చేశారు. ఇవి కూడా కేవలం రోగుల బంధువులు పోరాడితే బయటకు వచ్చిన…. తప్పనిసరి పరిస్థితులలో అధికారులు చర్యలు తీసుకుంటున్న వార్తలు మాత్రమే. కరోనా అనే కాదు ప్రయివేటు దందా లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్నా సరైన వైద్యం అందక ప్రాణాలు తీస్తున్నారు. ఏ హాస్పిటల్ మంచిదో చెప్పలేని పరిస్థితి. అల్లోపతి వైద్యం అంటే ఆస్తులను బట్టి చేసేది అన్నట్లుగా సోషల్ మీడియాలో వ్యంగ్యంగా కామెంట్లు చూస్తున్నాము. నిజానికి ఈ విషయంలో మీడియాలో జరుగుతున్న ప్రచారం కంటే ఇంకా ఎక్కువగానే దుర్మార్గాలు జరుగుతున్నాయి.

ఇలాంటి పరిస్థితులలో వేలలో ఒక్కడుగా నిలుస్తారు డాక్టర్ ఇమ్మాన్యుయేల్. ఈయన దగ్గర కరోనాకు మనిమం 400 రూపాయలనుండి మాక్సిమమ్ 15000 రూపాయలతో రోగం తగ్గిపోతున్నదని పేషంట్లు చెపుతున్నారు. రెమిడిసివర్, ఆక్సిజన్, బెడ్లు, ఇంటికి వచ్చి నర్సులు పర్యవేక్షించడం వంటి అన్ని రకాలుగా సేవలు అందిస్తున్నారు. వైద్యుడు విక్టర్‌ ఇమ్మాన్యుయెల్‌ చేస్తున్న సేవలు వార్తలుగా నిలిచాయి. వివిధ పత్రికలు, చానళ్లలో స్వయంగా రోగుల అభిప్రాయాలతో వార్తలు వినిపించడం, కనిపించడం ఆసక్తికరంగా, ఆశావహంగా మారింది. మరోప్రక్క ఈ డాక్టర్ ఉచితంగా కూడా వైద్యసేవలు అందిస్తున్నారు. సైనికులు, రైతులు, అనాథలు, దివ్యాంగులకు ఫీజు తీసుకోకపోవడమే గాక వారికి జబ్బు నయం అయ్యే దాకా మందులు కూడా ఉచితంగా అందిస్తున్నారు. దాతలు కూడా ఈయనకు సహకరిస్తుండడం శుభపరిణామం. నిరుపేద రోగులకు టెస్టులు, మందులూ ఉచితంగానే అందిస్తున్నారు. కొవిడ్‌ సోకిన నిరుపేద రోగులకు ల్యాబ్‌ పరీక్షలు మొదలుకుని మందులు, ఇంజక్షన్‌లు సైతం తక్కువ ధరకే అందిస్తున్నారు.

కరోనా వైద్యం 400 నుండి 20 వేలలోపే….

కరోనాకు కావలసిన ఆక్సిజన్‌, రెమ్‌డెవివిర్‌ ఇంజెక్షన్లు బయట దొరకని పరిస్థితులు, బ్లాక్ లో వేలు, లక్షలు పెట్టి కొనుక్కోవలసిన పరిస్థితలు చూస్తున్నాము. ఇక్కడ మాత్రం రోగులకు ఇవన్నీ తక్కువ ధరకే సమకూర్చుతున్నారు. ఇందుకు ఇతర వైద్యుల సహాయాన్ని ఆయన తీసుకుంటున్నారు. రోగులు రవాణా ఖర్చులు భరించగలిగితే ఇంటి వద్ద వైద్యం చేయించుకునే రోగుల కోసం నర్సులను పంపుతున్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చవుతుండగా… పైగా ప్రాణాలు నిలుపుతారనే గ్యారంటీ లేని స్థితిలో రూ.20 వేలలోపే కరోనా వైద్యం అందిస్తుండడంతో ఇమ్మాన్యుయెల్‌ ఆధ్వర్యంలో నడుపబడుతున్న ప్రజ్వల క్లినిక్‌ పలువురికి ఆశాదీపంగా మారింది. పేదవారికి ఆయన కనిపించే దైవంగా, ఓ వరంగా కనిపిస్తున్నారు. ఈయన క్లినిక్ లోనే కాకుండా పీర్జాదిగూడ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ ఐసొలేషన్‌ సెంటర్‌లోనూ డాక్టర్‌ ఇమ్మాన్యుయెల్‌ ఏడాదిగా కరోనా బాధితులకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. రోగులతో చాలా ఓపికగా మాట్లాడతారని, ఆయన మాటలతో రోగులలో ధైర్యం వస్తుందని, ఇక్కడి సిబ్బంది కూడా చాలా పద్దతిగా వ్యవహరిస్తారనీ పేషంట్లు చెపుతున్నారు. ఇన్ని రకాలుగా సేవలు చేస్తున్న ప్రజ్వల క్లినిక్ కు, దీనికి సహకరిస్తున్న ఆసుపత్రి సిబ్బందికి, ఆర్ధిక సహకారం అందిస్తున్న దాతలకు హేట్సాప్ చెపుదాం.

కరోనా సమయంలో కూడా తమ కక్కుర్తిని వదలకుండా కాసులు సంపాదిస్తున్న డాక్టర్లూ….. ఆలోచించండి. మీరు పోయాక మీరు సంపాదించిన డబ్బు మీకు ఉపయోగపడదు. మీరు కూడా డాక్టర్ ఇమ్మాన్యుయెల్‌ లా సేవ చేస్తూ పేరు సంపాదించుకోండి. వైద్యో నారాయణో హరీ అన్న మాటకు అర్ధం కలిపించండి. ఆలోచించండి. మారడానికి ప్రయత్నించండి. మరణమ్రుదంగం వేళ మీలో నిద్రాణమై ఉన్న మానవత్వాన్ని మేల్కొల్పండి.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి