జనవిజయంసినిమాఇది వేడుకలు చేసుకునే సమయం కాదు - ఎన్.టి.ఆర్

ఇది వేడుకలు చేసుకునే సమయం కాదు – ఎన్.టి.ఆర్

  • బర్త్‌డే వేడుకలు వద్దన్న జూనియర్
  • ట్విట్టర్‌ ద్వారా అబిమానులకు ఎన్టీఆర్‌ పిలుపు

నెల 20న జూనియర్‌ ఎన్టీఆర్‌ 38వ పడిలోకి అడుగు పెట్టనున్నారు. ఆయన బర్త్‌డేని పురస్కరించుకొని అభిమానులు భారీ హంగామా సృష్టించకుండా ఉండాలని సూచించారు. కరోనా వేళ వీటన్నింటికి దూరంగా ఉండాలంటూ జూనియర్‌ ఎన్టీఆర్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టారు. అభిమానులందరికి పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొద్ది రోజులుగా విూరు పంపుతున్న సందేశాలు, వీడియోలు చూస్తున్నాను. విూ ఆశీస్సులు నాకెంతో ఊరట కలిగించాయి. ఏమిచ్చి విూ రుణం తీర్చుకోగలను? ప్రస్తుతం నేను క్షేమంగా ఉన్నాను. త్వరలోనే కోలుకొని కోవిడ్‌ను జయిస్తాను అని ఆశిస్తున్నాను. ప్రతి ఏటా విూరు నా పుట్టిన రోజున చూపే ప్రేమ, చేసే సేవా కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తాను. కాని ఈ సంవత్సరం ఇంటి పట్టునే ఉంటూ లాక్‌ డౌన్‌ లేదా కర్ఫ్యూ నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. ఇదే విూరు నాకు అందించే అతి పెద్ద కానుక అంటూ పోస్ట్‌ చేశారు. ఇది వేడుకు చేసుకునే సమయం కాదు. మనదేశం కరోనాతో యుద్ధం చేస్తుంది. కనిపించని శత్రువుతో అలుపెరుగని పోరాటం చేస్తున్న డాక్టర్స్‌, నర్సులు, ఇతర ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు మన సంఫీుభావం తెలపాలి. ఎందరో తమ ప్రాణాలను, జీవనోపాధిని కోల్పోయారు. ఆ కుటుంబాలకు కుదిరితే అండగా నిలబడాన్నారు. విూ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. విూరు జాగ్రత్తగా ఉండండి. ఒకరికి ఒకరం సాయం చేసుకుంటూ, చేతనైన ఉపకారం చేయండి. త్వరలో మనదేశం ఈ కరోనాను జయిస్తుందని నమ్ముతున్నాను. ఆ రోజున మనం అందరం కలిసి వేడుక చేసుకుందాం. అప్పటి వరకు మాస్క్‌ ధరించి జాగ్రత్తగా ఉండండి. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ విూ ఎన్టీఆర్‌ అంటూ పెద్ద పోస్ట్‌ పెట్టారు జూనియర్‌.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి