ట్రాన్స్జెండర్లకు విశిష్ట గుర్తింపు కార్డులు
ఖమ్మం, జూలై 24 (జనవిజయం):
ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వ పథకాల లబ్ది చేకూర్చుటకు ప్రత్యేక విశిష్ట గుర్తింపు కార్డులను అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం ఐడిఓసి లోని కలెక్టర్ ఛాంబర్ లో ట్రాన్స్జెండర్లకు కలెక్టర్ గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ప్రత్యేక విశిష్ట గుర్తింపు కార్డుల కొరకు 49 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. దరఖాస్తుల క్షేత్ర స్థాయి తనిఖీలు చేపట్టి, గుర్తింపు కార్డుల జారికి చర్యలు చేపట్టినట్లు ఆయన అన్నారు. ఇప్పటి వరకు 20 దరఖాస్తుల తనిఖీలు పూర్తయి, కార్డుల జారికి చర్యలు తీసుకున్నట్లు, మిగతా దరఖాస్తులు క్షేత్ర తనిఖీలు చేయాల్సివుందన్నారు. ప్రతి దరఖాస్తుదారునికి ప్రత్యేక రిజిస్ట్రేషన్ ఇచ్చి, కార్డుల జారికి చర్యలు చేపట్టామన్నారు.