జనవిజయంతెలంగాణవారం రోజుల్లో కోవిడ్ నియంత్రణ - సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ

వారం రోజుల్లో కోవిడ్ నియంత్రణ – సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ

ఖమ్మం,జూన్1(జనవిజయం): వారం రోజుల్లో కోవిడ్ పాజిటివ్ శాతాన్ని పూర్తిగా నియంత్రణలోకి తీసుకువచ్చేందుకు పటిష్ట చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ ఆదేశించారు. మంగళవారం సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఏ.ఎన్.ఎంలు, అధికారులతో రాష్ట్ర వైద్య సంచాలకులు జి.శ్రీనివాసరావుతో కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ కోవిడ్ పాజిటివ్ కేసుల నమోదు శాతాన్ని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ పాజిటివిటీ అధికంగా నమోదు కావడానికి గల కారణాలను క్షుణ్ణంగా పరిశీలించి పటిష్ట ప్రణాలికతో కట్టడి చర్యలు చేపట్టాలన్నారు. ఆశా కార్యకర్తలు, ఏ.ఎన్.ఎంలు, అంగన్ వాడీ, పంచాయితీ, రెవెన్యూ, పోలీసు శాఖల సిబ్బంది, స్వచ్చంధ సేవా సంస్థల సహాకారంతో పాటు యువతను భాగస్వాములను చేసి ఆరోగ్య పరిరక్షణ, కోవిడ్ బారీన పడకుండా ప్రజల్లో విస్తృత అవగాహన పెంపొందించడం ద్వారానే కోవిడ్ ఉధృతిని నియంత్రించగలుగుతామన్నారు. ఏ.ఏ రంగాల వారు కోవిడ్ కు గురవుతున్నారన్న అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ఆ దిశగా నిర్ధారణ పరీక్షలు, వైద్య సేవలు అందించాలన్నారు. ఇంటింటి సర్వే కార్యక్రమంలో ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి మెడికల్ కిట్స్ అందించడం, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా వ్యాధి తీవ్రతను నియంత్రించవచ్చన్నారు. ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్, ఔషదాలు అన్ని సరిపడా నిల్వలు ఉన్నాయని, అవసరం మేరకు సిబ్బంది నియమించడం జరిగిందన్నారు. సిబ్బంది కొరత ఉన్న ప్రాంతాలలో వెంటనే సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగంలాలో క్షేత్రస్థాయిలో కోవిడ్ వ్యాప్తిని సమీక్షించాలన్నారు. లాక్ డౌన్ పట్టిష్టంగా అమలు చేయాలన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని జిల్లా బార్డర్ ప్రాంతాల చెక్ పోస్టుల్లో పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.

వైద్య శాఖ సంచాలకులు జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల చొరవతో రాష్ట్రంలో ఆక్సిజన్, ఔషధాలు సరపడా నిల్వలు సిద్ధం చేయడం జరిగిందని, ప్రతిరోజు అన్ని జిల్లాల వైద్యధికారులతో సమీక్షించడం జరుగుతుందన్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఈ రోజు ఖమ్మం జిల్లాలో పర్యటించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయపు ఓ.ఎస్.డి గంగాదర్, జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రు, డిప్యూటీ డి.ఎం. అండ్. హెచ్.ఓ సీతారాం, కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సుబ్బారావు, సూర్యనారాయణ, మున్సిపల్ కమీషనర్ సుజాత, తహశీల్దారు మీనన్, కల్లూరు డివిజన్ వైద్యాధికారులు, సిబ్బంది, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి