కల్లూరు,ఏప్రిల్ 14(జనవిజయం):ఖమ్మంజిల్లా ఎస్ బిఐ బ్యాంక్ ఎంప్లాయిస్ యస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన మీటింగ్ కు వరక రామారావుని ఆహ్వానించారు. రాష్ట్ర స్థాయిలో స్ఫూర్తి ఫౌండేషన్ తరుపున చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఉన్నత చదువులు చదువుతున్న పేద విద్యార్థులకు ఆర్థిక సహాయo, నిరు పేదవృద్ధులకు సహాయ సహకార కార్యక్రమాలను జిల్లా స్థాయిలో గమనించి, స్ఫూర్తి ఫౌండేషన్ ప్రతినిధి వరకా రామారావుని సన్మానించారు. మరియు ఎస్ బిఐ బ్యాంకు ఎంప్లాయిస్ తరుపున ఫౌండేషన్ కు రూ. 10,000 చెక్ ను అందించారు. కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్స్ సంతోష్ కుమార్, శ్రీనివాస్ రావు, ఎస్కె ఇబ్రహీం, కె వెంకటేశ్వర్లు, నందన్, కళ్యాణ్ కుమార్, ఎస్ బిఐ బ్యాంకు వివిధ స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు అందరు ఫౌండేషన్ వారు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా మావంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.