గోదావరి వరద సహాయక చర్యల కై ఇరువురి ఐఏఎస్ ల నియామకం
- కలెక్టర్ ప్రియాంక అలా
భద్రాచలం, జూలై 20, (జనవిజయం):
భద్రాచలం వద్ద గోదావరి వరదలు సహాయక చర్యలు పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులైన గౌతం పోట్రూ, కృష్ణ అదిత్యలను నియమించినట్లు జిల్లా కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. ప్రత్యేక అధికారులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ భద్రాచలంలో మకాం వేసి ఎప్పటి కప్పుడు వరదలపై సమీక్ష నిర్వహిస్తూ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు.