భద్రాచలం, ఆగస్ట్ 10 (జన విజయం): గోదావరి వరద బాధితులకు మెరక ప్రాంతంలో ఇంటి స్థలాలు ఇవ్వాలని, గృహ లక్ష్మీ పథకాన్ని అర్హులందరికీ ఏకకాలంలో అమలు చేయాలనీ సీపీఎం డిమాండ్ చేసింది. సిపిఎం ఆధ్వర్యంలో గురువారం చర్ల లో భారీ ప్రదర్శన, మహా ధర్నా నిర్వహించారు. చర్ల మండలంలో ఇంటి స్థలం లేని పేదలందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలని, వారందరికీ గృహలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. గృహ లక్ష్మీ దరఖాస్తులను గ్రామపంచాయతీ కార్యాలయంలో స్వీకరించే విధంగా కౌంటర్లను ఏర్పాటు చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఆదాయం కులం సర్టిఫికెట్లను త్వరితగతిన జారీ చేయాలని, గృహలక్ష్మి దరఖాస్తుదారులు కులం ఆదాయం సర్టిఫికెట్లను అందజేయడం కోసం గడువును పొడిగించాలని సిపిఎం ప్రభుత్వాన్ని కోరింది. రేషన్ కార్డు లేని వారికి సైతం గృహలక్ష్మికి అవకాశం కల్పించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేసేరు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కారం నరేష్ అధ్యక్షతన జరిగిన సభ లో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, నియోజకవర్గ కో కన్వీనర్ కారం పుల్లయ్య మాట్లాడారు. వరద ముంపు బాధితులు అందరికీ ఐదు సెంట్లు ఇంటి స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు మండలంలోని సొంత ఇల్లు లేని పేదలకు పూరి గుడిసెల్లో ఉండే వారికి రేకుల షెడ్డుల్లో నివాసం ఉంటున్న పేదలకు ఏకకాలంలో గృహలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని అందుకుగాను 15 వేల గృహాలను చర్ల మండలానికి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు తరచూ వరదలకు గురవుతున్న పేదలకు నరక ప్రాంతంలో స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వమే బాధ్యత వహించి ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేశారు పదో తారీకు లాస్ట్ తేదీ అని ప్రకటించడం అన్యాయమని దరఖాస్తుల తేదీని ఆగస్టు 30 వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు వరద ముంపు బాధితులకు ఇంటి స్థలాలు ఇల్లు నిర్మించే వరకు పోరాడుతాం అని సిపిఎం ప్రకటించింది సమస్య పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు ధర్నా సందర్భంగా పేదల వద్దకు వచ్చి దరఖాస్తులు తాసిల్దారు గారు స్వీకరించారు గోదావరి వరద ముంపు బాధితులకు మేరక ప్రాంతంలో ఇంటి స్థలాలు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నామని అందుకోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని వరద ముంపు బాధితులకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతామని ధర్నా వద్దకు వచ్చిన తాసిల్దారి గారు హామీ ఇచ్చారు అన్ని గ్రామపంచాయతీల్లో గృహలక్ష్మి దరఖాస్తులు తీసుకునే విధంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తాం ఆదాయం కులం సర్టిఫికెట్లను తర్వాత అందించేందుకు వెసులుబాటు కల్పిస్తామని అర్హులైన వారందరికీ ఇంటి స్థలాలు కేటాయించే విధంగా జిల్లా కలెక్టర్ గారికి నివేదిస్తామని పేదలందరికీ న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన ధర్నా వద్దకు వచ్చిన తాసిల్దారు గారు హామీ ఇచ్చారు ఈ మహా ధర్నా కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే బ్రహ్మచారి జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్ బి రమేష్ పార్టీ మండల నాయకులు మచ్చ రామారావు పొడుపు గంటి సమ్మక్క తాటి నాగమణి బందెల చంటి పామారు బాలాజీ తాళ్లూరి కృష్ణ కొమరం కాంతారావు సత్రం పల్లి సాంబశివరావు శ్యామల వెంకటేశ్వర్లు పెద్దపల్లి సర్పంచ్ సమ్మక్క వరలక్ష్మి మాజీ ఎంపీటీసీలు సోంది నారాయణ కనితి నాగేశ్వరరావు కూసుమంచి వెంకటేశ్వర్లు కారం నాగేశ్వరరావు కాక సీత మడకం సీతయ్య పెద్దారపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.