ఖమ్మం, జూలై 29(జనవిజయం): మున్నేరు ఉప్పొంగడంతో నగరంలో పలు డివిజన్లలో వరదలతో ఎన్నో కుటుంబాలు ఇంటి సామగ్రి అంతా పోగొట్టుకొని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇట్టి వారిని ఆదుకోవడానికి ఎంతోమంది సహృదయులు ముందుకు వస్తున్నారు. జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ. 4.40 లక్షల విలువచేసే 100 క్వింటాళ్ల నాణ్యమైన బియ్యాన్ని 1000 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 10 కిలోల సన్నబియ్యం అందజేస్తున్నట్లు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మ రాజేశ్వరరావు తెలిపారు. ఇట్టి బియ్యాన్ని నగరంలోని ముంపు బాధితులకు పంపిణీ చేస్తున్నట్లు ఆయన అన్నారు. అసోసియేషన్ కార్యదర్శి జువ్వాజి నగేష్, కోశాధికారి సిహెచ్. నగేష్, మధు, బాలకృష్ణ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.