వనమా పై పెట్టిన కేసును జలగం ఎందుకు విత్ డ్రా కాలేదు..!?
అధిష్టానం బుజ్జగించినా జలగం వినలేదా..!!??
ఖమ్మం, 25 జూలై(జనవిజయం): పాలేరు పంచాయతీ ఓ కొలిక్కి వస్తుంది అనుకుంటున్న తరుణంలో కొత్తగూడెం పంచాయతీ తీవ్రరూపం దాల్చడం ఉమ్మడి ఖమ్మం జిల్లా BRS పార్టీ అభిమానులను కలచి వేస్తోంది. తెలంగాణా హైకోర్టు సంచలనాత్మక తీర్పుతో కొత్తగూడెం బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.ఎల్.ఏ వనామా వెంకటేశ్వరవు పై అనర్హత వేటు మరియు 5 లక్షల ఫైన్ పడటంతో పార్టీ కార్యకర్తలు గందరగోళం లో పడ్డారు.ఎవరో వ్యతిరేక పార్టీ అభ్యర్థులు ఈ కేసును వేసిఉంటే ఇంత గందరగోళం లో కార్యకర్తలు ఉండకపోయేవారే..కానీ సొంత పార్టీ నాయకుడే ఈ కేసుని గెలవడం తో పార్టీ అభిమానులను గందరగోళం లో కి నెట్టింది.
2018 ఎన్నికల్లో వనమా వెంకటేశ్వరవు కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ప్రత్యర్థి TRS పార్టీ అభ్యర్థు జలగం వెంకట్రావు పై సుమారు పదివేల పైచిలుకు ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. అనంతరం వనమా TRS పార్టీ తీర్థం తీసుకోవడం అందరికీ తెలిసిన విషయమే.వనమా ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ పొందుపరిచారని జలగం వెంకట్రావు 2019 లో వనమా కి వ్యతిరేకంగా హైకోర్టు ను ఆశ్రయించగా ఈ రోజు హైకోర్టు ఇచ్చిన సంచలనాత్మక తీర్పుతో వనమా మీద అనర్హత వేటు తో పాటు 5 లక్షల ఫైన్ పడటం జరిగింది.2019 లో వేసిన కేసు ఇప్పటి వరకు కొనసాగుతుంటే అధిష్టానం జలగం వెంకట్రావు తో కేస్ ని ఎందుకు విత్ డ్రా చేయించలేకపోయింది అనే సందేహం చాలా మందిలో మెదులుతోంది.ఒకవేళ అధిష్టానం నచ్చజెప్పినా జలగం అధిష్టానాన్ని లెక్కచేయలేదా?.. ఒకవేళ అదే జరిగుంటే హైకోర్టు తీర్పుని పార్టీ అధిష్టానం ఎలా జీర్ణించుకోగలదు? అంతే కాదు జలగానికి పార్టీ సముచిత స్థానం ఇస్తుందా..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలను పార్టీ అభిమానులను కలచివేస్తోంది. మాజీ ఎం.పి పొంగులేటు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్న అనంతరం BRS పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవహారం లో ఆచి తూచి వ్యవహరిస్తున్న తరుణంలో మరో తలనొప్పి వ్యవహారం గా ఈ విషయాన్ని కార్యకర్తలు భావిస్తున్నారు.హైకోర్టు తీర్పు పై వనమా సుప్రీంకోర్టు లో అప్పీల్ చేస్తాననడం చూస్తుంటే ఈ వ్యవహారానికి BRS పార్టీ అధిష్టానం ఎలా ముగింపు ఇవ్వనుందో వేచి చూడాల్సిందే.