జనవిజయంఆంధ్రప్రదేశ్వైద్యరంగం బలోపేతానికి నిధులు కేటాయించాలి

వైద్యరంగం బలోపేతానికి నిధులు కేటాయించాలి

  • ఆస్పత్రుల్లో వసతుల కల్పనకు పెద్దపీట వేయాలి
  • కరోనా విసిరిన సవాళ్లకు సమాధానం చెప్పగలగాలి

న్యూఢిల్లీ, జూన్ 8(జనవిజయం): కరోనా కారణంగా మన వైద్యరంగం డొల్లతనం బయటపడింది. దేశంలో చివరకు మాస్కుల నుంచి ఆక్సిజన్ కొరత వరకు అనేక అనుభవాలు వచ్చాయి. పిపిఇ కిట్లు కూడా తయారు చేసుకోగలిగాం. ఈ క్రమంలో ప్రస్తుత అనుభవాలతో పాలకులు చిత్తశుద్ధితో పనిచేస్తే తప్ప వైద్యరంగం బలపడదు. అందుకు అవసరమైన నిధులు వెచ్చించాలి. వ్యాక్సిన్ కోసం వెచ్చిస్తామని ప్రకటించిన నిధులను వైద్యరంగం బలోపేతం కోసం వెచ్చించాలి. ఇప్పుడు కేంద్రమే వ్యాక్సినేషన్ బాధ్యత తీసుకున్నందున ఈ చర్యలకు ఉపక్రమించాలి. కరోనా వైరన్ గడిచిన వందేళ్లలో వచ్చిన అతిపెద్ద మహమ్మారని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గతంలో ఇలాంటిది చూడలేదని, అనుభవించలేదని చెప్పారు. ఈ శతాబ్దంలోనే ఇది అత్యంత ఘోరమైన విషాదం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వచ్చిన తర్వాత దేశంలో వైద్య రంగాన్ని బలోపేతం చేశామన్నారు. అయితే దేశంలో ఆస్పత్రులు మాత్రం బలోపేతం కాలేదు. అంతేగాకుండా కరోనా ట్రీట్ మెంట్ విషయంలో నిర్దుష్ట విధానం అమలు కావడం లేదు. ఆస్పత్రుల్లో లక్షలకు లక్షలు ఎందుకు వసూలు చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. రెండో వేవ్ వచ్చిన తర్వాత ఆక్సిజన్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి డిమాండ్ రాలేదు. విమానాలు, రైళ్ల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేయాల్సిన అనవరం ఏర్పడింది. విదేశాల నుంచి కూడా అత్యవసరంగా ఆక్సిన్ తెచ్చుకునే దుస్థితి ఏర్పడ్డది.

ఈ క్రమంలో వైద్యరంగం లోపాలను సమీక్షించుకుని విశ్లేషించాలి. కోవిడ్ నిబంధనలను అందరూ పాటించాలి. మాస్క్, భౌతిక దూరం పాటించాలి. వ్యాక్సిన్ రక్షణ కవచం లాంటిది. వ్యాక్సిన్ తయారు చేసే సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా తక్కువగా ఉన్నాయి. విదేశాల నుంచి వ్యాక్సిన్ తెచ్చుకోవటం కఠినతరంగా ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. దేశంలో వందశాతం వ్యాక్సినేషను ప్రణాళికలు రూపొందించినా అందుకు తగ్గ ప్రణాళిక కూడా అవసరమే. వ్యాక్సినేషన్ వేగవంతం చేసే సమయంలోనే రెండో వేవ్ వచ్చింది. థర్డ్ వేవ్ కూడా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో వైద్యరంగం బలోపేతం కావాలి. కరోనాను ఎదురిస్తామనే విశ్వానం అందరికీ వచ్చేలా చేయాలి. మౌలిక సదుపాయాలతో పాటు భారీగా నిధులు కూడా కేటాయించాలి. థర్డ్ వేవ్ వల్ల పిల్లలపై ప్రభావం ఉంటుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద వైద్యులకు వ్యాక్సిన్ వేయడం వల్లే పరిస్థితి మెరుగ్గా ఉంది. అలాగే అనేక రంగాలకు ఇలా వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ క్రమంలో వైద్య రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను తీసుకుని ముందుకు సాగాలి. కరోనా చికిత్సకు అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యపరంగా ప్రోటోకాల్ రూపొందించుకోవాలి.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి