- నివాళులు అర్పించిన టీడీపి పార్లమెంట్ నాయకులు వాసిరెడ్డి రామనాథం
బోనకల్, జూలై 16 (జనవిజయం) :
మండల పరిధిలోని గోవిందపురం (ఎల్)గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వడ్డాణపు బాలకోటి 70 సం స్వర్గస్తులయ్యారు.ఈయనకి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కలరు.బాలకోటి భౌతిక ఖాయంను తెలుగుదేశం పార్టీ సీమియర్ నాయకులు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లాపార్లమెంటరీ అధ్యక్షులు మధిర నియోజకవర్గం ఇంచార్జ్ డా!!వాసిరెడ్డి రామనాధం సందర్శించి పార్టీ జెండా కప్పి నివాళులు అర్పించారు.ఇటీవలే మృతి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వల్లంకొండ అప్పయ్య స్మారక స్తూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించుట జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మల్లాది హనుమంతరావు, బోనకల్ మండల కన్వీనర్ రావూట్ల సత్యనారాయణ, జిల్లా నాయకులు మైనేని రవికుమార్,గ్రామ శాఖ అధ్యక్షులు మామిళ్ళ నర్సింహారావు,మాజీ సర్పంచ్ కల్యాణపు వెంకటేశ్వరరావు,మామిళ్ళ కోటేశ్వరరావు, మామిళ్ళ వెంకట్నారాయణ,వివిధ పార్టీ నాయకులు కల్యాణపు నాగేశ్వరరావు, సర్పంచ్ ఉమ్మినేని బాబు, తమ్మారపు వెంకటేశ్వర్లు, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.