జనవిజయంఆరోగ్యంవ్యాక్సిన్ ఉత్పత్తికి కఠిన నిర్ణయాలు అవసరం

వ్యాక్సిన్ ఉత్పత్తికి కఠిన నిర్ణయాలు అవసరం

  • ఉత్పత్తి సంస్థలకు అండగా ప్రభుత్వాలు నిలవాలి
  • ఆర్థిక సాయం అందిస్తేనే ఇది సాధ్యం అవుతుంది

న్యూఢిల్లీ, మే25(జనవిజయం): సీరం ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డుకు తోడు మనకు అందుబాటులో ఉన్న రెండో వ్యాక్సిన్ కొవాగ్జిన్. దీన్ని మన భారతీయ కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ధి పరిచింది. సీరమ్ ఇన్స్టిట్యూట్ అడుగుజాడల్లో ఈ కంపెనీ కూడా తమ టీకాను రూ.150 చొప్పున కేంద్ర ప్రభుత్వానికి విక్రయిస్తోంది. ఈ రెండు కంపెనీల ఉత్పత్తులు విరివిగా ఉంటే తప్ప ఇప్పుడున్న స్థితిలో దేశంలో వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా సాగేలా లేదు. అందుకు వీటి ఉత్పత్తి సామర్థ్యం పెరగాలి. అందుకు ఇతర కంపెనీలకు లేదా సంస్థలకు కూడా ఈ ఉత్పత్తి బాధ్యతలను అప్పగించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ‘నిర్బంధ లైసెన్సింగ్ ” నిబంధనను ఉపయోగించుకోవచ్చని ప్రపంచ వాణిజ్య నంస్థ పేటెంట్ల నియమాలు స్పష్టంగా పేర్కొన్నా యి. నావిడ్ విపత్తు లాంటి జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో పేటెంట్ ఉన్న ఒక వస్తువును ఇతర కంపెనీలు కూడా ఉత్పత్తి చేయవచ్చని డబ్ల్యుటిఓ పేటెంట్ నియమాలు స్పష్టం చేశాయి. నిర్బంధ లైసెన్లు జారీ చేసేందుకు యోగ్యమైన ప్రాతిపదికలు ఏమిటో దేశాలే నిర్ణయించుకోవచ్చని డబ్ల్యుటిఓ స్పష్టంగా పేర్కొంది. అలాగే ఎలాంటి విపత్కర పరిణామాలను జాతీయ అత్యవసర పరిస్థితిగా పరిగణించ వచ్చునో కూడా ప్రపంచ వాణిజ్యనంస్థ విశదం చేసింది. అయితే మన ప్రభుత్వం ‘నిర్బంధ లైసెన్సింగ్’ వెనులు బాటును ఉపయోగించుకోవడం లేదు. ఆ సదుపాయాన్ని ఉపయోగించుకుంటే బహుళజాతి కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుందేమోనని మన ప్రభుత్వం భయపడినట్టుంది. అందుకే కరోనాను కట్టడి చేయకముందే దేశంలో ఇతర ఫంగల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. తాజాగా బ్లాక్, వైట్, ఎల్లో ఫంగన్స్ విజృంభణ భయాందోళనలకు గురి చేస్తోంది. ముక్కులో ఫంగన్ చేరిన సమయంలో క్లీన్ చేయగలిగితే వ్యాధి తీవ్రతను అరికట్టవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. లేదంటే ముక్కు నుంచి వెనుక భాగం గుండా కళ్లకు ఫంగన్ చేరుతుంది. ముక్కులోనుంచి గొంతు నరాల ద్వారా మెదడుకు, కంటి నుంచి కూడా మెదడుకు ఫంగనకు వ్యాప్తిస్తుంది. మెదడు వరకు ఫంగన్ వెళ్లినప్పుడు మెదడు, కన్ను లోపల భాగాలు ప్రభావితమవుతాయి. వెనుకభాగం నుంచి కన్నంతా ఫంగన్ చేరుతుంది. నర్జిల్ మేనేజ్మెంలో భాగంగా మెదడు లోపలకు ఫంగన్ వెళ్లకుండా నిలువరించడానికి కన్నంతా తొలగించాల్సి ఉంటుంది. ఫంగన్ సోకిన వ్యక్తి వ్యాధి నిరోధక శక్తిని బట్టి వ్యాధి తీవ్రత ఉంటుంది. చక్కెర స్థాయి అదుపులో లేకపోయినా, రోగనిరోధక శక్తి లేకపోయినా ఫంగన్ సోకిన మూడ్రోజుల్లోనే వ్యాధి తీవ్రత కన్పిస్తుంది. కేన్సర్ మాదిరిగా కన్ను నుంచి బ్రెయిన్ లోకి ఫంగన్ వెళితే సాధారణ స్థితికి రోగిని తీసుకు రావడం సాధ్యం కాదు. ఫంగన్ లక్షణాలు కన్పించిన వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. అయితే ముందు కరోనాను కంట్రోల చేసే చర్యలకు ఉపక్రమించాలి. ఈ క్రమంలో వ్యాక్సిన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీ పెట్టుబడులు సమకూర్చాలి. విదేశీ బహుళజాతి కార్పొరేట్ కంపెనీలు తమ తమ ప్రభుత్వాల నుంచి అందుతున్న ఇతోధిక ఆర్థిక సహకారంతో వ్యాక్సిన్లను అభివృద్ధి పరుస్తున్నాయి. కొనాన్షన్ వ్యాక్సిన్‌ను సొంతంగా అభివృద్ధి పరిచిన తరువాత మాత్రమే భారత్ బయోటెక్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1500 కోట్ల ఆర్థిక సహాయమందింది. ఆ వ్యాక్సిన్ అభివృద్ధి ప్రక్రియను ఉపయోగించుకునేందుకు ప్రపంచ దేశాలు అన్నిటికీ అనుమతి ఇవ్వాలి. తద్వారా అన్ని దేశాలూ ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆ వ్యాక్సినను తమకుతామే అభివృద్ధి పరచుకుని కొవిడ్ మహమ్మారి నుంచి బయటపడతాయి. దీనివల్ల బహుళజాతి కార్పొరేట్ కంపెనీల టీకాలకు మార్కెట్ పడిపోతుంది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఉత్పత్తిని ఇతోధికం చేసేందుకు భారత్ బయోటెకకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలి. అప్పుడే డిమాండ్ ను అందుకోగలం.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి