జనవిజయంఅధ్యయనంవ్యాక్సిన్ సమర్థత 80 శాతం వరకు మాత్రమే!

వ్యాక్సిన్ సమర్థత 80 శాతం వరకు మాత్రమే!

వ్యాక్సిన్ వేయించుకున్నా జాగ్రత్తలు అవసరమే

న్యూఢిల్లీ, జూన్ 3 (జనవిజయం): వ్యాక్సిన్ వేసుకున్నా జాగ్రత్తలు పాటించకుంటే కరోనా బారిన పడక తప్పదని కేసులను బట్టి వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకున్నాక నిర్లక్ష్యంగా ఉన్నవారిలో కూడా మళ్లీ మళ్లీ కరోనా సోకుతుందని అంటున్నారు. వ్యాక్సిన్ సమర్థత 80 శాతం వరకు మాత్రమే ఉంటుందని గుర్తించాలని హెచ్చరిస్తున్నారు. మశూచి లేదా పిల్లలకు వేసే టీకాల్లో కొందరిలో మళ్లీ మళ్లీ మశూచి సోకడం కూడా ఇదే కారణమని అంటున్నారు. టీకా వేయించుకున్న వంద మందిలో 80 మందికి పనిచేస్తే మరో 20 మందిలో పనిచేయకపోవచ్చు. వంద మందిలో 50 మందికి బాగైనా ఉపయోగకరంగానే భావిస్తారు. కరోనా వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ తీవ్రతను మాత్రమే వ్యాక్సిన్ తగ్గిస్తుంది. కొందరిలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఏ మందు,వ్యాక్సిన్ సంజీవని కాదు, అమృతం అంతకన్నా కాదని అంటున్నారు. కానీ.. వ్యాక్సిన్ తీసుకున్న వెయ్యి మందిలో అయిదారుగురు మాత్రమే ఐనీయూ వరకు వెళతారనేది వాస్తవం. అదే వ్యాక్సిన్ తీసుకోని వెయ్యి మందిలో 100 నుంచి 150 మంది వరకు ఐసీయూ దాకా వెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పక వ్యాక్సిన్ తీసుకోవాలి. రెండు డోసుల టీకా వేయించుకున్న ఆరోగ్య కార్యకర్తల్లో జాగ్రత్తలు తీసుకున్న వారిలో ఒక్కరు కూడా కొవిడ్ తో చనిపోలేదని వైద్యులు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 269 మంది రిజిస్టర్డ్ వైద్యులు సెకండ్ వేవ్ లో కరోనాతో చనిపోయారని భారత వైద్య సమాఖ్య (ఐఎంఏ) మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అత్యధికంగా బిహార్ లో 78 మంది, ఉత్తరప్రదేశ్ లో 37 మంది, ఢిల్లీలో 29 మంది వైద్యులు చనిపోయినట్టు ఐఎంఏ వెల్లడించింది. అపోలో ఆస్పత్రుల్లో రెండు డోసులూ వేయించుకున్న 3600 మంది వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తల్లో కేవలం 2.6 శాతం మంది మాత్రమే సెకండ్ వేవ్ లో వైరన్ వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడ్డారని.. వారిలో ఒక్కరు కూడా చనిపోలేదని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారిలో పదిమందికి రెండు నెలల తర్వాత వైరస్ సోకింది. కానీ, వారంతా అయిదు రోజులకే కోలుకున్నారు. ఎవరికీ ఎలాంటి అపాయం కలగలేదు. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, ఊపిరితిత్తుల జబ్బులు, హృద్రోగాలు, స్థూలకాయం, కాలేయ, మూత్రపిండ వ్యాధులు ఉన్నవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటివారు టీకా వేయించుకున్నా కొత్త వేరియంట్ల బారిన పడితే ఇబ్బందులు ఎదురవుతాయి. ఇటీవలి మరణాల్లో ఎక్కువ శాతం మంది ఇలాంటి జబ్బులతోనే మరణిస్తున్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి