జనవిజయంఆంధ్రప్రదేశ్వ్యాక్సినేషన్ పంపిణీకి పక్కా ప్రణాళిక రూపొందాలి !

వ్యాక్సినేషన్ పంపిణీకి పక్కా ప్రణాళిక రూపొందాలి !

వ్యాక్సినేషన్ బాధ్యత ఇక పూర్తిగా కేంద్రమే తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు తమవంతుగా పక్కా ప్రణాళిక సిద్ధం చేయాల్సి ఉంటుంది. రాష్ట్రాలు వ్యాక్సిన్ పంపిణీకి షెడ్యూల్ చేయడం ద్వారా సామాన్యులకు క్యూలు కట్టే అవస్థలు తప్పించాలి. గ్రామాల వారీగా వ్యాక్సిన్ పంపిణీకి ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించాలి. ఢిల్లీ ప్రభుత్వం బూత్ ల వారిగా ఓటేసిన చోటే వ్యాక్సిన్ అన్న విధంగా ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రాలు వ్యాక్సిన్ పై ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని ప్రధాని మోడీ చేసిన ప్రకటన నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు తమ పంపిణీ విధానాన్ని రూపొందించాలి. అందుకు అనుగుణంగా వ్యాక్సిన్ సరఫరాను కోరాలి. కేంద్రమే వ్యాక్సిన్లు కొని రాష్ట్రాలకు ఇస్తుంది కాబట్టి ఇక విమర్శలను కట్టిపెట్టి పక్కా ప్రణాళిక మేరకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముందుకు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. వ్యాక్సిన్లు ఇచ్చే విషయంపై కేంద్రం, రాష్ట్రాలు కలసి రూట్ మ్యాప్ రూపొందిస్తాయని ప్రధాని మోడీ ప్రకటించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏ మేరకు ఎలా పంపిణీ చేయాలన్నది నిర్ణయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఇందుకు గ్రామాల వారీగా వ్యాక్సినేషన్ చేసే ప్రణాళిక రూపొందించాలి. నిరక్షరాసులైన గ్రామాణులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోలేరు కనుక వారి గుమ్మం వద్దకే వ్యాక్సిన్ చేరుకునేలా ప్రణాళిక సిద్ధం చేయాలి. ఏ గ్రామానికి ఏ రోజు వ్యాక్సిన్ వెళుతుందో పక్కా ప్రణాళిక ఉండాలి. అలాగే ఏ వార్డులో ఎవరికి చేరుతుందో కూడా గ్రామాల్లో ప్రకటన చేయిస్తే మరీ మంచిగా ఉంటుంది. ఈ నెల 21నుంచి వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీకి ప్రధాని మోడీ ప్రకటన చేశారు. కోవిడ్ సెకెండ్ వేవ్ నేపథ్యంలో కేంద్రం తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్ లభ్యత, స్వదేశీ వ్యాక్సిన్ల అభివృద్ధి తదితర కీలక విషయాలపై జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించిన సందర్భంలో ఈ ప్రకటన చేశారు.

ఆలస్యంగా అయినా ప్రధాని మోడీ చేసిన ప్రకటన రాష్ట్రాలకు, ప్రజలకు ఊరటనిచ్చేదిగా ఉంది. వ్యాక్సినేషన్ బాధ్యత ఇక పూర్తిగా కేంద్రమే తీసుకుంటుందని, రాష్ట్రాలు ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా కేంద్రమే వ్యాక్సిన్లు సమకూర్చి ఉచితంగా ఇస్తుందని ప్రధాని కీలక ప్రకటన చేశారు. దీంతో రాష్ట్రాలకు ఆర్థిక భారం తప్పనుంది. గ్లోబల్ టెండర్లు అంటూ చేసిన హడావిడి తప్పనుంది. ఇప్పుడు కేంద్రమే ఆ బాధ్యత కూడా తీసుకుంటుంది. రాబోయే రెండు వారాల్లో ఈ విధానాన్ని అమల్లోకి తేనున్నారు. ఈ నెల 21 నుంచి 18 ఏళ్ల పైబడిన వారికి ఉచిత వ్యాక్సిన్ ఇస్తున్నట్టు కూడా ప్రధాని ప్రకటించారు. ప్రైవేటు ఆసుపత్రులు వ్యాక్సిన్లపై సర్వీన్ చార్జి కింద కేవలం రూ.150 మాత్రమే వనూలు చేయాల్సి ఉటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆస్పత్రల్లో ఇప్పటికే 1200 నుంచి 1500 వరకు వసూలు చేస్తున్న వారిని కట్టడి చేయాలి. వ్యాక్సిన్ ను అత్యధిక ధరలకు విక్రయిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై చర్య తీసుకునే బాధ్యత ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలపై ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంతకాలం అభాసు పాలయ్యింది. హామీ మేరకు వ్యాక్సిన్ ఇవ్వలేకపోయారు. ప్రజలు వ్యాక్సిన్ కుస్తీలు పట్టారు. ఎప్పుడు వస్తుందో తెలియక తంటాలు పడ్డారు. అలాంటి దుస్థితి మళ్లీ మళ్లీ రాకుండా ఈ పదిహేను రోజుల్లో ఆయా రాష్ట్రాలు పక్కా ప్రణాళిక రూపొందిస్తే ప్రజలకు కూడా తిప్పలు తప్పుతాయి.

గతకొంత కాలంగా వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును వివిధ రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా విమర్శించారు. కేంద్రం తీరును సుప్రీం కోర్టు కూడా కేంద్రాన్ని అనేక సందర్భాల్లో ప్రశ్నించింది. ఇక వ్యాక్సిన్ ఫ్రీగా పంపిణీ చేస్తామని కేంద్రం చెప్పిన దరిమిలా ప్రణాళిక రూపొందించడం ద్వారా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాల్సిన బాధ్యత స్థానిక ప్రభుత్వాలదే. ఈ నెల 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ మేరకు 21 నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తామన్నారు. కేంద్రం పరిధిలోనే ఇక పూర్తిగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగనుందన్నారు. అలాగే ప్రైవేట్ ఆసుపత్రలకు 25 శాతం డోసులు ఇస్తామని ప్రధాని ప్రకటించారు. ఇకపోతే కరోనాతో చేస్తున్న యుద్ధంలో భారత్ గెలుస్తుందని, నవంబర్ నాటికి 80 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని చెప్పారు. వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలతో మనం పోటీ పడ్డామన్న ప్రధాని నరేంద్రమోదీ, కరోనాను తుద ముట్టించేందుకు కూడా సంకల్పాన్ని ప్రకటించారు. ఈ క్రమంలో ప్రజలు కూడా తమ బాధ్యతను విస్మరించరాదు. ఇంతపెద్ద దేశంలో వ్యాక్సిన్ వేయడం ఆషామాషీ కాదు. అందరికీ వ్యాక్సిన్ అందచేయడం కూడా అంత సులువు కాదు.

తక్కువ సమయంలో వ్యాక్సిన్లు తయారు చేయడంలో భారత శాస్త్రవేత్తలు విజయం సాధించారు. వ్యాక్సిన్ల తయారీలో గతంలో మాదిరిగా కాకుండా రికార్డు సమయంలో భారత్ బయోటెక్ లాంటి సంస్థలు వ్యాక్సిన్ తయారు చేయగలిగాయి. వ్యాక్సినేషన్ లో ఏ దేశంతోనూ వెనుకబడి లేమని, దేశం న్వయం సమృద్ధిగా మారిందని నిరూపించారు. ప్రస్తుతం దేశంలో ఏడు ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాయని తెలిపారు. మరో మూడు కంపెనీల వ్యాక్సిన్లు ట్రయల్స్ దశలో ఉన్నాయి. చిన్నారులకు టీకా తయారు చేయడానికి భారీగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని మోదీ చెప్పారు. ఇప్పటి వరకు 23 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చామన్న ప్రధాని వ్యాక్సిన్లకు సంబంధించి కొందరు కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారని, ఇలాంటి వారందరినీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిజానికి వ్యాక్సిన్ కొరత కారణంగా అనేక విదేశీ సంస్థలు కూడా భారత్ లో తయారీకి మొగ్గు చూపాయి. అవన్నీ ప్రారంభ దశలో ఉన్నాయి. దేశంలో కరోనాతో ప్రజలు ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి గందరగోళంలో పడ్డారు. వారిని వ్యాక్సిన్తో ఆదుకోవాల్సిన బాధ్యత నిజానికి ప్రభుత్వాలదే. ఆలస్యంగా అయినా ప్రధాని మోడీ ఉచిత వ్యాక్సిన్ కు అంగీకరించినందున పంపిణీ అన్నది చాలా ముఖ్యం. దీనిని పక్కాగా రూపొందించగలిగితే భవిష్యత్ లో ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా అదే ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లడానికి అనువుగా ఉండగలదు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి