జనవిజయంఆరోగ్యంకోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి - అధికారులను ఆదేశించిన మంత్రి పువ్వాడ...

కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి – అధికారులను ఆదేశించిన మంత్రి పువ్వాడ అజెయ్ కుమార్

ఖమ్మం,జూన్10(జనవిజయం): కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా కనీస సదుపాయాలు సమకూర్చాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. నగరంలోని శాంతినగర్ జూనియర్ కళాశాలో ఏర్పాటు చేసిన సూపర్ స్పైడర్స్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ తో కలిసి గురువారం మంత్రి సందర్శించి వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం సూపర్ స్పైడర్స్ అందరికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని, వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద కనీస వసతులైన నీడ, త్రాగునీటి సౌకర్యం, కూర్చునే సదుపాయాలు సమకూర్చాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అదేవిధంగా వ్యాక్సినేషన్ అనంతరం తప్పనిసరిగా 30 నిమిషాలు అబ్జర్వేషన్లో ఉంచాలని, అందుకుగాను ప్రతి కేంద్రంలో వెయిటింగ్ రూమ్, అబ్జర్వేషన్ రూమ్ తప్పనిసరిగా ఉండాలని మంత్రి సూచించారు. వ్యాక్సినేషన్ కొరకు వచ్చేవారికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఎప్పటికప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల నుండి సమాచారాన్ని సేకరించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని మంత్రి ఆదేశించారు. కరోనా వ్యాప్తిని పూర్తిగా నిరోదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టిందని దీనిలో భాగంగా సూపర్ స్పైడర్స్ కు వ్యాక్సినేషన్ కు గాను ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. సూపర్ స్పైడర్లు అందరూ తమకు కేటాయించిన కేంద్రాలకు వెళ్ళి తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవాలని మంత్రి కోరారు. నగరమేయర్ పునుకొల్లు నీరజ, నగరపాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా||మాలతి, కార్పోరేటర్లు, వైద్య సిబ్బంది తదితరులు మంత్రి వెంట పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి