జనవిజయంతెలంగాణవ్యాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

వ్యాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

ఖమ్మం, మే28 (జనవిజయం) : జిల్లాలో 7,500 మంది సూపర్ స్పెడరర్స్ కు ఈ నెల 28, 29 తేదీలలో కోవిడ్ వ్యాక్సినేషన్ కొరకు 24 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశలో గుర్తించిన సూపర్ స్పెడర్స్ రేషన్ షాప్ డీలర్స్, వర్కర్స్, ఎల్.పి.జి డీలర్స్, వర్కర్స్, పెట్రోల్ బంక్ వర్కర్స్, జర్నలిస్టులు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్ డీలర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు గాను నగరంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ సందర్శించారు. నగరంలోని ఎఫ్.సి.ఐ గోదాము, రిక్కాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల, పి.జి కళాశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఖమ్మం నగర పాలక సంస్థ పరిధితో పాటు మండల కేంద్రాలలో మొత్తం 24 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో గుర్తించిన సూపర్ స్పైడర్స్ కు నేడు, రేపు రెండు రోజులు వ్యాక్సినేషన్ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. వ్యాక్సినేషన్ కొరకు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారితో పాటు రిజిస్ట్రేషన్ చేసుకోనటువంటి వారి కోసం ఆయా వ్యాక్సినేషన్ కేంద్రాలలో రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచామని, సంబంధిత శాఖల ద్వారా గుర్తించిన సూపర్ స్పైడర్స్ అందరూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకొని వ్యాక్సినేషన్ తీసుకోవాలని కలెక్టర్ కోరారు. మొదటి విడత అనంతరం ప్రభుత్వ ఆదేశానుసారం రెండవ విడతలో గుర్తించబడిన సూపర్ స్పైడరర్స్ కు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంటుందని. ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. కోవిడ్ కట్టడికి గాను ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వల్ల ఖమ్మం జిల్లాలో పాజిటీవ్ రేటు తగ్గుముఖం పట్టిందని దీనితోపాటు ఇంటింటి జ్వరసర్వే వలన స్వల్పరోగ లక్షణాలు కలిగిన వారిని ముందుగానే గుర్తించి వారికి కిట్స్ అందించడంతో పాటు టెస్టు నిర్వహించడం ద్వారా జిల్లాలో పాజిటివ్ రేటు తగ్గిందని కలెక్టర్ తెలిపారు. నగరపాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ ఎన్.మధుసూధన్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, అర్భన్ తహశీల్దారు శైలజ, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి