జనవిజయంతెలంగాణభూవివాదం కేసులో ఉప్పల్ ఎమ్మెల్యే

భూవివాదం కేసులో ఉప్పల్ ఎమ్మెల్యే

కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన పోలీసులు

హైదరాబాద్, మే24(జనవిజయం): ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి భూవివాదం కేసులో చిక్కుకున్నారు. ఉప్పల్ ఎమ్మెల్యేతో పాటు కాప్రా ఎమ్మార్వో గౌతంకుమార్ పై కేసు నమోదు చేశారు. బలవంతంగా భూ కబ్దా చేసినందుకు గాను వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాప్రాలో సర్వే నెంబర్ 152లో 90 ఎకరాల భూవివాదంలో సుభాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ భూవివాదంలో సుభాష్ రెడ్డిపై తలదూర్చినట్లు ప్రచారం జరుగుతోంది. సుభాష్ రెడ్డి డబ్బు డిమాండ్ చేశారని మేకల శ్రీనివాస్ యాదవ్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో సుభాష్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. భూవివాదాలు టీఆర్ఎస్ నేతలకు తలనొప్పిగా మారాయి. ఇప్పటికే మాజీమంత్రి ఈటెల రాజేందర్ భూ వివాదంలో చిక్కుకున్నారు. అయితే ఈటలపై మరో భూ కబా ఫిర్యాదు వచ్చింది. ఈటల కుమారుడు నితిన్ రెడ్డి తన భూమిని కట్టా చేశారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ మేడ్చల్-మల్కాజిగిరిజిల్లా మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామానికి చెందిన పీట్ల మహేశ్ ముదిరాజ్ అనే వ్యక్తి తాజాగా సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై తక్షణమే దర్యాప్తును ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో రోజుకో మంత్రి లేదా ఎం.ఎల్.ఏ భూ కబ్జాలపై ఆరోపణలో, పిర్యాదులో, కేసులో వార్తలుగా రావడం పరిపాటయింది. వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరిపించి భూకబ్జాదారుల పని పట్టాలని ప్రజలు కోరుతున్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి