జనవిజయంఉపాధిఉపాధి కూలీలకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి - వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్రి...

ఉపాధి కూలీలకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి – వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్ డిమాండ్

ఖమ్మం,జూన్12(జనవిజయం): కరోనా నేపథ్యంలో ఉపాధి కూలీలకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్ డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా కమిటీ సమావేశం సంఘం జిల్లా అధ్యక్షులు వేరు సత్యనారాయణ అధ్యక్షతన ఖమ్మం సుందరయ్య భవనంలో శనివారం జరిగింది. ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్ హాజరై మాట్లాడుతూ తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఉపాధి కూలీలను గుంపులు గుంపులుగా పని చేయించటం వల్ల మరింత మంది కరోనా బారిన పడి అనేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ఉపాధి పనులను ఆపి ఉపాధి కార్డు ఉన్న వాళ్లందరికీ నెలకు 7500 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని 50 కేజీల బియ్యం కేరళ తరహాలో 17 రకాల నిత్యవసర వస్తువులను అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా టెస్టులు పెంచి వ్యాధిగ్రస్తులు అందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆయన అన్నారు. వ్యవసాయ కార్మికులు అందరికీ పని ప్రదేశాల్లో కరోనా నివారణ వ్యాక్సిన్ ఇవ్వాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు.

అనేక దేశాలు ప్రజలను ఆదుకోవడం కోసం ఆర్థిక సహాయం చేస్తే మన కేంద్ర ప్రభుత్వం కరోనా కాలంలో డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచి అన్ని నిత్యావసర వస్తువుల రేట్లు ప్రజలకు అందుబాటులో లేకుండా వ్యవసాయ కార్మికులను అర్ధాకలితో చంపుతున్నారని ఆయన విమర్శించారు. భారతదేశంలో 135 కోట్ల మంది ప్రజలు ఉంటే 300 కోట్ల వ్యాక్సిన్లు అవసరం కాగా కేవలం 20 కోట్ల వ్యాక్సిన్లు ఆర్డర్ పెట్టడం చూస్తుంటే ప్రజల ఆరోగ్యం మీద కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దానివల్లనే కరోనా అనేకమంది పేదలు చనిపోతున్నారని అర్ధం అవుతోందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ముందు చూపు లేదని ఆయన విమర్శించారు ఇప్పటికైనా వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రజలని రక్షించాలని కరోనా ఉన్నంతకాలం వ్యవసాయ కార్మికులకు సంక్షేమ పథకాలను అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా కాలంలో కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా మాస్కులు శానిటైజర్ లు టెంట్లు మెడికల్ కిట్లు లేకుండా అనేక ప్రాంతాల్లో ఉపాధి పనులు చేయిస్తున్నారని, రోజుకు వంద రూపాయలు లోపు ఇస్తున్నారని, ఇది మరీ అన్యాయం అని ఆయన అన్నారు.

కేరళ తరహాలో కొలతల తో నిమిత్తం లేకుండా సంవత్సరంలో ప్రతి కుటుంబానికి 200 రోజులు ఉపాధి పని చూపించాలని రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ గ్రూపులకు ఉపాధి బిల్లులు మూడు వారాల నుంచి 11 వారాల వరకు పెండింగ్లో ఉన్నాయని వాటిని తక్షణం విడుదల చేయాలని జిల్లా అధికారులను డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని దళిత గిరిజన వెనుకబడిన తరగతుల నివాస ప్రాంతాల్లో పారిశుద్ధ్యం చేయించి కరోన వ్యాధిని అరికట్టాలని ఆయన అన్నారు. రానున్న కాలంలో వర్షాలు పడితే సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆరోగ్యశాఖ అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా నాయకులు పొన్నగంటి సంగయ్య, మండవ కృష్ణారావు గద్దల రత్నమ్మ, భారీ మల్సూరు, బందెల వెంకయ్య, బంధం శ్రీనివాసరావు, మంద సైదులు, వడ్లమూడి నాగేశ్వరరావు, వేల్పుల భద్రయ్య, కె.వి.రెడ్,డి బాదావత్ శ్రీనివాస్, మేడి బిక్షం తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి