జనవిజయంజాతీయంయూపిలో పోలీసు దెబ్బలకు తాళలేక యువకుడి మృతి

యూపిలో పోలీసు దెబ్బలకు తాళలేక యువకుడి మృతి

పోలీస లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడంటూ దాడి

లక్నో, మే 22(జనవిజయం): ఉత్తర పోలీసుల దాష్టీకానికి ఓ యువకుడు బలయ్యాడు. తన ఇంటి బయట కూరగాయలు విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు లాక్కెళ్లి విచక్షణ రహితంగా కొట్టిన ఫలితంగా అతడు మరణించాడు. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావో జిల్లాలోని బంగర్ మువు పట్టణంలో జరిగిందీ ఘటన. ఇంటి బయట కూరగాయలు విక్రయిస్తున్న యువకుడిని చూసిన పోలీసులు కరోనా కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించాడంటూ అతడిని అదుపులోకి తీసుకుని చితకబాదారు. స్టేషన్‌కు తీసుకెళ్లి విచక్షణ రహితంగా చావబాదారు. దీంతో యువకుడు కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసుల తీరుపై బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు. యువకుడి మృతదేహంతో ఉన్నావో-బంగరమవు-హర్దోయి రహదారిపై ధర్నాకు దిగారు. యువకుడి మృతికి కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వడంతోపాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నినదించారు. పోలీసుల తీరుపై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఘటనకు కారణమైన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని తెలిపారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి