జనవిజయంఎన్నికలుయూపి ఎన్నికలపైనే బిజెపి నేతల దృష్టి

యూపి ఎన్నికలపైనే బిజెపి నేతల దృష్టి

  • బెంగాల్ గురి తప్పింది… యూ.పీలోనైనా పరువు నిలుస్తుందా?
  • కరోనా కష్టాలను గాలికి వదిలిన మోడీ,షా ద్వయం

న్యూఢిల్లీ, మే27 (జనవిజయం): ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి దృష్టి అంతా యూపిలో జరగబోయే ఎన్నికలపైనే ఉంది. అక్కడ మరోమారు అధికారం నిలుపుకోవడంపైనే సమాలోచనలు చేస్తున్నట్లుగా ఉంది. పోయిన అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి బెంగాల్ మీద ప్రత్యేకంగా గురిపెట్టారు. బోల్తా పడ్డారు. అయినా ఇంత క్లిష్ట పరిస్థితిలో కూడా వచ్చే ఏడాది ఆరంభంలో జరగవలసిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధానమంత్రి, అమిత్ షా, యుపి ముఖ్యమంత్రి యోగి, ఆర్ఎస్ఎస్ నేతలతో సమావేశమై చర్చలు జరిపారు. వ్యూహాలు రచిస్తున్నారు. నిజానికి కరోనాపై యుద్ధం చేయడంలో ఇలా వ్యూహాలు పన్నివుంటే దేశం బాగుపడేది. ప్రజలు బతికేవారు. దేశంలో పేదుల, సామాన్యులు ఆస్తులు అమ్ముకుని, అప్పులు చేసి లక్షలకు లక్షలు ఆసుపత్రుల్లో బిల్లులు కడుతున్నా ఆయా రాష్ట్రాల్లోని బిజెపి నాయకులు వాటి గురించి ఆరా తీసి కేంద్రానికి నివేదించడం లేదు. దీనికి తోడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంతే నిర్లక్ష్యంగా ఉన్నాయి. ఒక వ్యూహం ప్రకారం పరిపాలనకు భావోద్వేగాలను జోడిస్తూ వచ్చిన బిజెపి నేతలు ప్రజల సమస్యల విషయంలో కూడా అవే పరిష్కార మార్గాలుగా చూపుతున్నారు. దేశంలోని ప్రజల సమస్యలను పరిష్కరించే క్రమంలో భారతీయ జనతాపార్టీ అగ్రనాయకులు ఎక్కడా శ్రమించిన దాఖలాలు లేవు. తాము అనుకున్న మేరకు లక్ష్యశుద్ధి చెడకుండా వ్యవహరిస్తున్న అగ్రనాయక ద్వయం దేశం ఏమవుతున్నదనే విషయంలో పట్టింపులేకుండా ఉన్నారు. బిజెపి తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజానీకంలోని కొందరికి మాత్రమే ఆనందం కలిగించి ఉంటాయి.

కానీ అందరినీ కష్టాల్లోకి నెట్టిన నోట్ల రద్దు, జి.ఎస్.టి వంటి నిర్ణయాల విషయంలో పునరాలోచన చేయడం లేదు. నరేంద్ర మోదీ ఏమి చేసినా, ధనికులకు వ్యతిరేకంగా పేదలకు అనుకూలంగా చేస్తారని, ఆయన హయాంలో హిందువులకు గుర్తింపు పెరిగిందని, సరిహద్దులు దాటి పాకిస్థాన్ కు బుద్ధి చెప్పారని .. ఇటువంటి అభిప్రాయాలు బాగా ప్రచారం చేయడంలో ఇప్పుడు ఆరితేరారు. అధికసంఖ్యాకుల మనసులో సానుకూలతను నిర్మించాయని పదేపదే సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారు. కశ్మీర్, అయోధ్య వంటి విషయాలను పెద్దవిగా చేసి, దేశం ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలను చిన్నవిగా చేసి చూపుతున్నారు. ఢిల్లీలో ఇప్పటికీ బైఠాయించి ఉద్యమిస్తూ ఉన్న రైతులకు నచ్చ చెపపడంలో విఫలమయ్యారు. కరోనా మొదటి వెల్లువలో, యావత్ దేశానికి దిశానిర్దేశం చేసే నాయకుడిగా కనిపించిన నరేంద్రమోదీ ఇప్పుడు తీరని ఆశాభంగం కలిగించారు. మొదటి దశకు, రెండవ దశకు మధ్య లభించిన సమయాన్ని సమర్థమైన వ్యూహరచనకు, మౌలిక సదుపాయాల వృద్ధికి ఉపయోగించకుండా, రాజకీయ ప్రయోజనాల మీదనే దృష్టి పెట్టారన్న విమర్శలు వస్తున్నా లెక్క చేయడం లేదు.

నిపుణుల మాటలు, క్షేత్రస్థాయిలో ఉన్నవారి మాటలు, శాస్త్రజ్ఞుల సలహాలు… వినకుండా ఏకపక్షంగా వ్యవహరించారని వ్యాఖ్యలు వినిపించాయి. కరోనా కట్టడి విషయంలో ప్రధానమంత్రితో ముఖ్యమంత్రుల సమావేశం వల్ల ప్రయోజనం ఏమీ లేదని బెంగాల్, జార్ఖండ్ ముఖ్యమంత్రుల వ్యాఖ్యలకు విలువ లేకుండా పోయింది. కొవిడ్ సెకండ్ వేవ్ మన దేశ వైద్య ఆరోగ్య వ్యవస్థ లోపాలను స్పష్టంగా ఆవిష్కరించింది. ఎడతెగని చితిమంటలు, ప్రాణవాయువు కోసం హాహాకారాలు, ఆస్పత్రుల ముందు పడిగాపులు పాలకులను కరిగించలేకపోయింది. విపత్తును నివారించడానికి, నిరోధించ డానికి కావలసిన వ్యూహరచన చేయడం లేదు. సమస్యను పట్టించుకుంటున్నారన్న నమ్మకం కలిగించే ప్రయత్నాలు కానరావడం లేదు. అందుకే కర్తవ్యాలను నెరవేర్చడంలో నరేంద్రమోదీ ప్రభుత్వం విఫలమయిందన్న అభిప్రాయం ఏర్పడింది. ఎన్నికల వ్యూహాలపై ఉన్న స్పష్టత దేశ సమస్యలపై లేకుండా పోయింది. రాజకీయాలతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కబళించాలన్నదే లక్ష్యం కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు యూషి ఎన్నికలే వారి ప్రధాన ఎజెండాగా ఉంది. అందుకే దానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి