భద్రాచలం, ఆగస్ట్ 01 (జనవిజయం) : అంగన్వాడీ టీచర్స్, హెల్పెర్స్ ను ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించాలని ఎమ్మెల్యే పొదేం వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్టం లో గల అంగన్వాడీ టీచర్ హెల్పేర్ లు 48 ఏళ్లుగా చాలీ చాలని గౌరవ వేతనం తో పనిచేస్తున్నారని ఆయన అన్నారు. ప్రమోషన్ – రిటైర్డ్ మెంట్ బెనిఫిట్స్ – పెన్షన్ – 2016 నుండి పెండింగ్ TA – DA లు ఇవ్వాలని , BLO డ్యూటీ లు రద్దు చెయ్యాలి అని , మినీ అంగన్వాడీ సెంటర్ లను మైన్ సెంటర్ లుగా మార్చాలి అని , సదుపాయాలు లేక శ్రమ దోపిడీకి గురి అవుతున్నారు అని తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి కెసిఆర్ తో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలి అని కోరుతూ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ అస్సోసియేషన్ ( ఏఐటీయూసీ ) ఆధ్వర్యంలో మంగళవారం భద్రాచలం MLA పోడెం వీరయ్య కు సమస్యలు తో కూడిన వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా MLA పోడెం వీరయ్య మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయం ప్రస్తావించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వెర్పుల మల్లికార్జున్ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్ హెల్పేర్ లతో శ్రమ దోపిడీ గురి చేస్తూ అదనపు పనులు కేటాయిస్తూ ఇబ్బందులు పాలు చేస్తున్నారు అని విమర్శించారు ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ. నాయకులు నోముల రాంరెడ్డి విశ్వనాధం శివాజి పూనెం నర్సమ్మ సాధనపల్లి చిన్నారి హేమలత వేదబాయ్ చెల్లాయిపాప నర్సమ్మ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.