అతిధి అధ్యాపకులను కొనసాగించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
– డివైఎఫ్ఐ,ఎస్ఎఫ్ఐ
–ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ని భర్తరఫ్ చేయాలి
-డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు తుడుం ప్రవీణ్ లు డిమాండ్
-డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారికి వినతి
ఖమ్మం కలెక్టరేట్ , జూలై 21(జనవిజయం):
రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న గెస్ట్ అధ్యాపకులను కొనసాగించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ని వెంటనే రాష్ట్రప్రభుత్వం భర్తరఫ్ చేయాలని, తొలగించిన గెస్ట్ అధ్యాపకులను విధుల్లోకి తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ఎ, స్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు తుడుం ప్రవీణ్ లు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ అధ్యాపకులను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఖమ్మం కలెక్టరేట్ సముదాయంలో ఉన్న జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవిబాబుకి డివైఎఫ్ఐ,ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో శుక్రవారం వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
అనంతరం జరిగిన డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల.రమేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అతిథి అధ్యాపకులను అర్ధాంతరంగా విద్యాసంస్థల మధ్యలో వారిని తొలగిస్తూ కమిషనర్ ఉత్తర్వులు ఇవ్వడం సరైంది కాదని ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు పైన గడుస్తున్నా ఇంతవరకు విద్యార్థులకు పూర్తిస్థాయిలో క్లాసులు జరగడంలేదని గెస్ట్ అధ్యాపకులకు రెన్యువల్ ఆర్డర్ రాకపోయినా గత రెండు నెలల నుంచి కళాశాలలో విద్యార్థుల్ని అడ్మిషన్లు చేర్పిస్తూ క్లాసులు తీసుకుంటూ జీతాలు సంవత్సరాల తరబడి ఆపిన పేద విద్యార్థుల కోసం వారు కృషి చేస్తున్నారని వారన్నారు.
అలాంటివారిని ఇలా మధ్యంతరంగా ఇంటర్మీడియట్ కమిషనర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని వారిని తొలగించి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం అనేది ఆధ్యాపకుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, జీవో నెంబర్ 1465 ప్రకారం ఏ ఉద్యోగిని అయినా అర్ధాంతరంగా మధ్యలో తీసివేయడం అనేది లేదని, అయినా కమిషనర్ పాతవారిని కొనసాగించాలనే ఆలోచన చేయకుండా వారి పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం సరైంది కాదని వారు తెలిపారు.
వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1654 మంది గెస్ట్ అధ్యాపకుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని విద్యార్థుల సంఖ్యకనుగుణంగా లెక్చరర్ పోస్టుల్ని క్రియేట్ చేసి కొత్తవారికి కూడా అవకాశం కల్పించాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తుందని తెలిపారు. ఇలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ అధ్యాపకులు జీవితాలతో ఆడుకుంటున్న ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిటల్ ని వెంటనే భర్తరఫ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నీ వారు డిమాండ్ చేశారు.లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన నిరుద్యోగ సంఘాల ఆధ్వర్యంలో అతిథిదేపక్కను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు షేక్.పర్వీన్, గడ్డం.విజయ్, ఎర్ర.సాయి, కొచ్చర్ల.అజయ్ తదితరులు పాల్గొన్నారు.