ప్రజా ఉద్యమాల ద్వారానే రావులపల్లికి ఘన నివాళి
- ఏడవ వర్ధంతి సందర్భంగా సిపిఐ నివాళి
భద్రాచలం, జూలై 24 (జనవిజయం):
భారత కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్య నాయకులు రావుపల్లి నాగభూషణం ఆశయ సాధనకు కృషి చేయాలని సీపీఐ నాయకులు పిలుపునిచ్చారు. రావులపల్లి నాగభూషణం ఏడవ వర్ధంతి సందర్భంగా స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి ఆకోజు సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల ద్వారానే నాగభూషణంకు ఘనమైన నివాళులర్పించాలని అన్నారు. చివరివరకు ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి నాగభూషణం అన్నారు. రాబోయే తరంలో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కమిటీ సభ్యులు మురాల డానియల్ ప్రదీప్, సిపిఐ నాయకులు కొంగూరి రాము, తాటి పసి. కుమారి తదితరులు పాల్గొన్నారు.