- 88వ ఆవిర్భావ స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై విద్యార్థి లోకం ఉద్యమించాలి
- ఏఐయస్ఏఫ్ మాజీ రాష్ట్ర నాయకులు ఆకోజు.సునిల్ కుమార్
భద్రాచలం, ఆగస్ట్ 12 (జనవిజయం): భద్రాచలం పట్టణం లో ఏఐఎస్ఎఫ్ 88వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు ఆకోజు సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఏఐఎస్ఎఫ్ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) 1936 అగష్టు 12న ఆవిర్భవించి, దేశవ్యాప్తంగా విద్యారంగ సమస్యల పట్ల_ అంకితభావంతోటి ఆనాటి నుంచి ఈనాటి వరకు పోరాటాలు నిర్వహించే ఏకైక సంఘం ఏఐఎస్ఎఫ్ మాత్రమేనని భారత స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ దొరులకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటాలు నిర్వహించిందని అన్నారు.అదేవిధంగా నేటి విద్యార్థులు రేపటి భావి భారత నిర్మాతలని అలాంటి విద్యార్థులు చదువుతో పాటు తమ హక్కుల కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉందని విద్యార్థులు దేశంలో అన్ని రంగాలలో వెనుకబడుతున్నదని కాబట్టి విద్యార్థులు చదువుతో పాటు సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై అక్రమాలపై అధ్యయనం చేయాలని అన్నారు.
భారత స్వతంత్ర ఉద్యమం నుండి తెలంగాణ స్వరాష్ట్ర సపరిపాలన ఉద్యమం వరకు ఏఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషించిందని దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణకు పోరాడుతూ ఉందని అన్నారు.
ఏఎస్ఎఫ్ 88వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యార్థి లోకానికి సంఘ నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు బల్లా సాయి కుమార్, సాదనపల్లి.సతీష్, మనస్సే.కృష్ణ, లక్షణ్, AISF జిల్లా సహాయ కార్యదర్శి మారెడ్డి గణేష్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు నానిపల్లి. ప్రమోద్ బేతం ఇంద్రకీలాద్రి గుంజా గోపి యువజన సమాఖ్య పట్టణ కార్యదర్శి కొల్లిపాక శివ తిరుపతి రావు తిరుమలరావు ఆకాష్ విష్ణు కౌశిక్ కార్తీక్ అభిరామ్ ప్రేమ్ భార్గవ్ శివ వినీత్ విద్యార్థులు పాల్గొన్నారు.