విద్యార్దులకు ఉచిత వైద్య పరీక్షలు
భద్రాచలం, జూలై 20 (జనవిజయం):
భద్రాచలంలోని ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పిన్నంటి రాజశేఖర్ గురువారం విద్యార్దులకు ఉచిత వైద్య పరీక్షలు చేశారు. స్థానిక శిశు మందిర విద్యాలయంలోని పేద విద్యార్దులకు ఆయన వైద్య పరీక్షలు నిర్వహించారు. సేవాభావంతో డాక్టర్ రాజశేఖర్ వైద్యపరీక్షలు నిర్వహించడాన్ని పలువురు అభినందించారు.