TSUTF సత్తుపల్లి, అశ్వరావుపేట ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల నిరసన ర్యాలీ
సత్తుపల్లి, జూలై22( జనవిజయం):
గత 79 రోజులుగా మణిపూర్ రాష్ట్రం రావణ కాష్టం మాదిరి రగులుతున్నది. శాంతియుత వాతావరణం లేక జాతుల మధ్య ఘర్షణ చివరకు మహిళల అత్యాచారానికి, సామూహిక లైంగిక దాడికి గురవుతున్న దృశ్యాలు ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసినది. మణిపూర్ లో శాంతిని పునరుద్ధరించాలని, మానవత్వం మరిచిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ TSUTF సత్తుపల్లి, ఆశ్వ రావుపేటడివిజన్ ఆధ్వర్యములో ఉపాధ్యాయులతో నిరసన ప్రదర్శన జరిగింది.రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి మానవత్వం మరచి దాడులకు తెగబడుతున్న హంతక ముఠాల ఆగడాలను అరికట్టాలని, శాంతిని పునరుద్ధరించాలని, అల్లర్ల అణిచివేతకు కేంద్రం, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ నిర్వహించిన ఈ నిరసన ప్రదర్శనలోఖమ్మం జిల్లా కార్యదర్శులు గనిపిశెట్టి రమేష్,కోలేటినిర్మలా కుమారి,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి రావెళ్ల రమేష్,మహిళ కార్యకర్తలు BMS భాను,కిషోరి నాగమణి,,ఉమసత్తుపల్లి ఆధ్యక్ష,ప్రధాన కార్యదర్శలు బాల నాగేశ్వరరావు, కొప్పుల శ్రీనివాసరావు, దమ్మపేట మండల ప్రధాన కార్యదర్శి రాసుప్రాల ప్రసాద్ , UTF సీనియర్ B. బాలయ్య,ఉమామహేశ్వరరరెడ్డి, I నాగేశ్వరరావు, kotcherla శ్రీను, రహుల్, Sk మస్తాన్, B. వెంకతెస్వర్లు, మధు, రాజు, శేషుకుమార్ , రవికుమార్ , p. రమేష్ , M. రామారావు, M. నరసింహరావు, K. వెంకటేశ్, మధు తదితరులు పాల్గొన్నారు.