జనవిజయంతెలంగాణతెలంగాణలో పెరుగుతున్న ధాన్యం దిగుబడులు

తెలంగాణలో పెరుగుతున్న ధాన్యం దిగుబడులు

  • వరిధాన్యం కొనుగోళ్లే ఇందుకు నిదర్శనం
  • ప్రోత్సాహకాలతో పెరిగిన ధాన్యం దిగుబడి

హైదరాబాద్, మే28(జనవిజయం): తెలంగాణలో ఇప్పుడు వ్యవసాయికంగా బాగా పురోగమించిందనే చెప్పాలి. ధాన్యం రాశులే దీనికి నిదర్శనం. ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు ఎదురు చూస్తున్న దృశ్యాలు చూస్తుంటే ఎంతగా ధాన్యం దిగుబడి అయ్యిందో గమనించాలి. ఓ వైపు జోరుగా కొనుగోళ్లు జరుగుతున్నా మరోవైపు తమ ధాన్యం కొనడం లేదని రైతులు ఆందోళనలకు దిగితున్నారు. ఇదంతా ఓ వైపు గోదావరి ఉరుకులు పరుగులు…. సాగుతో జిల్లాల్లో ధాన్యం దిగుబడులు పెరిగాయి. మరోవైపు ధాన్యం దిగుబడిలో ఇప్పటికే అగ్రస్థానంలో నిలిచిందన్న కేంద్రం ప్రశంసలతో తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవం సాధించిన ఘనత సిఎం కెసిఆర్ కు దక్కనుంది. వరిదిగుబడి, ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని భారత ఆహార సంస్థ గతేడాది చేసిన ప్రకటన తెలంగాణ వ్యవసాయరంగం పురోగమిస్తోందనడానికి సంకేతం. ఇక అవసరమున్న పంటలను పండించాలన్న లక్ష్యంతో తెలంగాణ వ్యవసాయ రంగం బహుముఖంగా అభివృద్ధి చెందనుంది. కరోనా కాలం కష్ట సమయంలో ధాన్యాగారంగా, యావద్దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ అవతరించింది. ఈ విజయం వ్యవసాయరంగ పురోభివృద్ధిలో సాధించిన మైలురాయిగా చూడాలి. కరువులు, వలసలతో కొండంత కష్టాలతో కుమిలిపోయిన అన్నదాతల జీవితాలు గట్టెక్కుతున్నాయి. రైతుబంధుతో పెట్టుబడి సాయంతో పాటు 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు సరఫరాతో వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులకు కెసిఆర్ శ్రీకారం చుట్టారు. కరోనా సంక్షోభంలో అన్నదాత ఆగం కావొద్దని ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలుచేసేందుకు ఊరూరా కొనుగోళ్లను ప్రారంభించారు. యాసంగి దిగుబడిలో మునుపెన్నడూ ఎరుగని రీతిలో వరి దిగుబడి సాధించి తెలంగాణ రైతులు రికార్డు సృష్టించారు. ఆ తరువాత పండించిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే కొనడంతో అన్నదాతలకు భరోసా దక్కింది. దేశంలో ఏ రాష్ట్రం కూడా తెలంగాణ మాదిరిగా ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. గ్రామాల్లోనే కేంద్రాలను ఏర్పాటుచేసి ధాన్యాన్ని కొనడం సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ దశలో వ్యవసాయంలో మరో విప్లవాత్మక మార్పునకు తెలంగాణ సర్కారు దృఢ నిశ్చయంతో ఉన్నది. కృష్ణా, గోదావరి, మూనీ నదీ జలాలు పుష్కలంగా లభిస్తున్న తరుణంలో పంట మార్పిడి దిశగా నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నది. గిరాకీ ఉన్న పంటల్నే పండించడం, డిమాండ్ ఉన్నప్పుడే పంటను మార్కెట్ కు తేవడం.. నియంత్రిత వ్యవసాయం లక్ష్యం. వ్యవసాయానికి పెట్టుబడి సాయం మొదలు విత్తనాల్లో సబ్సిడీ, ఎరువుల్లో రాయితీ సమకూర్చుతున్న ప్రభుత్వం…రైతులు మూస విధానం వీడి మంచి ఆదాయం పొందేలా మేధోమధనం జరిపింది. ఈ మేరకు జిల్లా నేలలకు అనువైన పంటలు వేసి లాభాలు గడించేలా ప్రణాళిక రూపొందించింది. ఒకే రకమైన పంటలసాగుతో ధరలు తగ్గి రైతులు నష్ట పోతున్న నేపథ్యంలో డిమాండ్ ఉన్న పంటలకు రైతులు కూడా మొగ్గుచూపుతున్నారు. దేశచరిత్రలో ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వమూ సాహసించని రీతిలో తెలంగాణ ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన యాసంగి ధాన్యం విలువ పదివేల కోట్ల రూపాయల పై మాటే అని తెలుస్తోంది. యాసంగిలో పండిన వరిధాన్యం సేకరణలో జాతీయస్థాయిలో తెలంగాణది కీలక భాగస్వామ్య మని ఎఫ్ ఐ పేర్కొన్నది. గతేడాది ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన ద్వారా ఉచిత రేషన్ పంపిణీలో భాగంగా తెలంగాణలో 2.87 లక్షల టన్నుల బియ్యాన్ని 1.91 కోట్ల మంది నిరుపేదలకు ఉచితంగా అందించారని చెప్పారు. దీంతోపాటు 1.32 లక్షల టన్నుల సబ్సిడీ బియ్యాన్ని కేంద్రం రాష్ట్రానికి కేటాయించడం వల్ల 88 లక్షల మందికి లబ్ది చేకూరిందని పేర్కొన్నారు. లాక్ డౌన్ సమయంలో తెలంగాణ నుంచి ఎఫెసీఐ 13 లక్షల టన్నుల బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించిందని తెలిపారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి