Tuesday, October 3, 2023
Homeవార్తలుటీఎస్ ఐపాస్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

టీఎస్ ఐపాస్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

ఖమ్మం, జులై 19(జనవిజయం):

జిల్లాలో యూనిట్ల స్థాపనకు టిఎస్‌-ఐపాస్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులను వెంట వెంటనే పరిష్కరించి, అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అన్నారు. బుదవారం ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి టీఎస్‌-ఐపాస్‌ కమిటీ సమావేశాన్ని కలెక్టర్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 61 యూనిట్ల స్థాపనకుగాను 100 అనుమతులకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయన్నారు. 88 దరఖాస్తులను అనుమతించడం జరిగిందని, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌కు సంబంధించి 2 దరఖాస్తులు అనుమతి కొరకు పరిశీలనలో ఉన్నాయన్నారు. విద్యుత్‌ శాఖకు సంబంధించి 1 దరఖాస్తుకుగాను అనుమతుల ప్రక్రియ ప్రగతిలో ఉందన్నారు. ఫ్యాక్టరీలకు సంబంధించి 2 దరఖాస్తులకుగాను 1 దరఖాస్తుకు అనుమతి ఇవ్వగా, 1 దరఖాస్తు పరిశీలనలో ఉన్నాయన్నారు. పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి 2 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని కలెక్టర్‌ తెలిపారు. పరిశీలన ప్రక్రియలో దరఖాస్తులు తిరస్కరించక, దరఖాస్తుదారునితో ఆయా అనుమతికి కావాల్సినవి సమర్పణకు వారికి సహకరించాలని కలెక్టర్‌ అన్నారు.

ఈ సమావేశంలో జిఎం ఇండస్ట్రీస్‌ అజయ్‌ కుమార్‌, ఎల్డిఎం శ్రీనివాస్‌ రెడ్డి, రవాణా శాఖ అధికారి కిషన్‌రావు, ఇ.డి ఎస్సీ కార్పోరేషన్‌ నవీన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కృష్ణనాయక్‌, ఏడి మైన్స్‌ సంజయ్‌కుమార్‌, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి జయప్రకాష్‌, జిల్లా భూగర్భ జల శాఖ అధికారి శ్యాంప్రసాద్‌ నాయక్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments