జనవిజయంతెలంగాణతెలంగాణ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించిన హైకోర్టు

తెలంగాణ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించిన హైకోర్టు

  • తెలంగాణలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ఎందుకు చేపట్టలేదు?
  • బెడ్స్‌ సామర్థ్యంపై గ్రౌండ్‌ రియాల్టీకి పొంతన లేదు
  • ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ధరల పట్టిక ఎందుకు అమలు చేయడం లేదు?
  • రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించిన హైకోర్టు

హైదరాబాద్‌,మే17(జనవిజయం): తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి పలు కీలక ఆదేశాలు, సూచనలు చేసింది. సోమవారం సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా కేసీఆర్‌ సర్కార్‌పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో లాగా తెంగాణలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ఎందుకు నిర్వహించడం లేదని కోర్టు ప్రశ్నించింది. వ్యాక్సినేషన్‌ విషయంలో తెలంగాణ 15వ స్థానంలో ఉందని పిటిషనర్స్‌ కోర్టుకు తెలిపారు. బెడ్స్‌ సామర్థ్యంపై వెబ్‌సైట్‌లో ఒకలా.. గ్రౌండ్‌ లెవల్‌లో మరోలా ఉందేం..? అని హైకోర్టు మండిపడింది. మరోవైపు.. ప్రైవేటు అస్పత్రుల దోపిడీపై కూడా హైకోర్టు సీరియస్‌ అయ్యింది. కరోనా మొదటి దశలో ప్రైవేట్‌ హాస్పిటల్‌ ఛార్జీలపై ముగ్గురు ఐఏఎస్‌లతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేశారు.. కానీ రెండో దశలో కరోనా తీవ్రంగా ఉన్నా చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ప్రైవేట్‌ హాస్పిటల్‌ ఛార్జీలపై టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ముఖ్యంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో సిటిస్కాన్‌, ఇతర టెస్టులకు ధరలు నిర్ణయించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గతంలో ఇచ్చిన జీవో ఇప్పుడు సరిపోదని హైకోర్టు అభిప్రాయపడిరది. కొత్తగా ధరలపై నిర్ణయం తీసుకోవాలని తెంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. చాలా ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్‌ పద్దతిలో విధులు నిర్వహించే సిబ్బందికి వేతనాలు ఎందుకు చెల్లించడం లేదు..?. ఇలాంటి సమయంలో వారు ప్రాణాలకు తెగించి మరీ పనిచేస్తుంటే వారికి ఎందుకు వేతనాలు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. అదే విధంగా ప్రతి జిల్లాలో కమ్యూనిటీ కిచెన్‌లు ఏర్పాటు చేసి లాక్‌డౌన్‌లో ఉచిత భోజనం కల్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కార్పొరేషన్‌లు ఎన్జీఓతో ఒప్పందం చేసుకుని కమ్యునిటి కిచెన్‌లు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లా వెబ్‌సైట్‌లో కమ్యూనిటీ కిచెన్‌ వివరాలు పొందుపరచాలి అని హైకోర్టు సూచించింది. వాక్సినేషన్‌కు సంబందించిన పూర్తి వివరాలు సమర్పించాలి. సీనియర్‌ సిటిజన్‌లు, పేద వారికి వాక్సినేషన్‌ కోసం ఎన్జీవోతో ఒప్పందం చేసుకుని డ్రైవ్‌ ఇన్‌ వాక్సినేషన్‌ పెట్టండి. ఎలక్షన్‌ డ్యూటీలో ఉండి 500 మంది టీచర్లు కరోనా బారిన పడ్డారు. 15 మంది టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. ఎలక్షన్‌ డ్యూటీలో ఉండి కరోనా బారిన పడిన టీచర్లను కోవిడ్‌ వారియర్లుగా గుర్తించాలి. వారికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకారం అందించాలని కేసీఆర్‌ సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. ఇకపోతే మల్లాపూర్‌లో గర్భిణీ మృతి ఘటనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గర్భిణీ మృతి ఘటనపై విచారణ చేసి వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ప్రతి జిల్లాలో కమ్యూనిటీ కిచన్‌లు ఏర్పాటు చేసి లాక్‌డౌన్‌లో ఉచిత భోజనం కల్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కార్పొరేషన్లు, ఎన్జీఓతో ఒప్పందం చేసుకుని కమ్యూనిటీ కిచన్‌లు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలంది. ప్రతి జిల్లా వెబ్‌సైట్‌లో కమ్యూనిటీ కిచన్‌ వివరాలు పొందుపరచాలని తెలిపింది. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం ఈఎన్‌టీ ఆస్పత్రులు ఏర్పాటు చేశామని అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టుకు తెలియజేశారు. కమ్యూనిటీ సెంటర్లను టెస్టింగ్‌, ఐసోలేషన్‌ సెంటర్లుగా పరిగణించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను హైకోర్టు జూన్‌ 1కి వాయిదా వేసింది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి