- పాదచారులకు అసౌకర్యం కలిగించరాదు
- ట్రాఫిక్ ఎస్ఐ
భద్రాచలం, జూలై 31 (జనవిజయం): భద్రాచలం పట్టణం లో వాహనదారులు, వ్యాపారస్తులు ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ నాయుడు ఒక ప్రకటన లో విజ్ఞప్తి చేసేరు. వాహన దారులు సంబంధిత అన్ని కాగితాలు కలిగి ఉండాలని ఆయన సూచించారు. అధిక వేగం వెళ్ళ రాదని, అధిక శబ్దం వెలువడే హారన్ లు, సైరన్ లు వినియోగించరాదని ఆయన చెప్పారు. ఉదయ భాస్కర్ రోడ్, తాతగుడి సెంటర్, రామాలయ ప్రాంతం లో వ్యాపారస్తులు వాహన, పాద చారులకు అసౌకర్యం కలిగించ రాదని అన్నారు. వారి వారి షాప్ ఉన్న స్థల పరిధి లోనే సామాగ్రి పెట్టుకోవాలని ఎస్ ఐ సూచించారు. రోడ్డు ను ఆక్రమించి సామాగ్రి పెట్టడం ట్రాఫిక్ నిబంధనలు కు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. పాద చారులకు ఎటువంటి అసౌకర్యం కల్గించరాదని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు కు సంబంధించి వ్యాపారస్తులు, వాహనదారుల పై తమకు ఫిర్యాదులు అందితే వారికి కౌన్సిలింగ్ చేసి, తగు జరిమానా విధిస్తామని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.