జనవిజయంతెలంగాణషాపుల వద్దే ట్రేడ్ లైసెన్సుల ఆన్లైన్ దరఖాస్తులు - ఖమ్మం నగరపాలక కమీషనర్

షాపుల వద్దే ట్రేడ్ లైసెన్సుల ఆన్లైన్ దరఖాస్తులు – ఖమ్మం నగరపాలక కమీషనర్

ఖమ్మం,జూన్8(జనవిజయం): మున్సిపల్ యాక్ట్ – 158 ప్రకారము తమ యొక్క షాపులు నడుపుకొనుటకు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరము 2021-22 నకు గాను “ట్రేడ్ లైసెన్స్” కొరకు www.cdma.telangana.gov.in నందు ధరఖాస్తు చేసుకోవాలని ఖమ్మం మునిసిపల్ కమీషనర్ మంగళవారం నాడొక ప్రకటనలో తెలిపారు. ఇందుకు గాను వాణిజ్య,వ్యాపార సంస్థల యజమానుల సౌకర్యార్థం ది. 09.06.2021 నుండి నగరపాలక సంస్థ కార్యాలయ సిబ్బంది తమ వద్దకే వచ్చి “ట్రేడ్ లైసెన్స్” లను ఆన్‌లైన్ నందు నమోదు చేసుకుంటారని తెలిపారు. కావున నగరపాలక సంస్థ పరిధిలోని వాణిజ్య మరియు వ్యాపార సంస్థల యజమానులు సూచించిన దృవపత్రములను తమవెంట సిద్ధముగా ఉంచుకొనగలరు. (1) ప్రస్తుత ఇంటిపన్ను చెల్లింపు రశీదు, (2) షాపులీజు దస్తావేజు, (3) షాపు ఫొటో, (4) షాపు యొక్క విస్తీర్ణం, పొదబు & వెడల్పు (అడుగులలో), (5) ఆధార్ మరియు పాన్ కార్డు.  వాణిజ్య మరియు వ్యాపార సంస్థల యజమానులు నగరపాలక సంస్థ కార్యాల సిబ్బందికి సహకరించి ఇట్టి సదవకాశమును సద్వినియోగపర్చుకొని తమ తమ “ట్రేడ్ లైసెన్స్” లను పొందాలని సూచించారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి