జనవిజయంతెలంగాణటీపీసీసీ లొల్లి..! వచ్చేనా మొదటికి మళ్లీ..!!

టీపీసీసీ లొల్లి..! వచ్చేనా మొదటికి మళ్లీ..!!

హైదరాబాద్, జూన్13(జనవిజయం) : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఎన్నిక లొల్లి మళ్లీ మొదలైంది. దాదాపు అరడజను మందికి పైగా ఈ పదవికి పోటీ పడుతుండగా ప్రధానంగా రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి పేర్లు ఫైనల్ కి చేరాయని భావించిన తరుణంలో అధిష్టానం రేవంత్ రెడ్డిని ఒప్పించి ఆయనకు ప్రచార కార్యదర్శి పదవిని, జీవన్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా చేయాలని భావించింది. అయితే రేవంత్ మొదట దీనికి ఒప్పుకోగా అనుచరుల ఒత్తిడితో రెండోరోజు కల్లా అధిష్ఠానానికి తాను కేవలం ఎం.పీ గా ఉంటానని తెలుపడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఈలోగా నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు అయేంతవరకూ ఆగాలని జానరెడ్డి కోరడంతో ఎన్నిక వాయిదాపడింది. గత వారంరోజులుగా మళ్ళీ పిసిసి లొల్లి మొదలైంది. జగ్గారెడ్డి, మధుయాస్కీ,హనుమంతరావు లాంటి వారు అధిష్టానానికి హెచ్చరికలు పంపుతూనే ఉన్నారు. తెరాస నుండి బహిష్క్రుడైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ వీళ్ల పంచాయతీని చూసే పరిస్థితి బాగోలేదని గమనించి బిజెపిలోకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఏదో ఒక కఠిన నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణలో బిజెపి పుంజుకోవడం ఖాయమని ఆలస్యంగానైనా గుర్తించిన కేంద్రం ఈ విషయంలో ఒకటి, రెండు రోజులలో కీలక ప్రకటన చేయనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో సీనియర్ నాయకుడు హనుమంతరావు మళ్ళీ టిపీసిసి వ్యవహారాల ఇన్చార్జీ మాణిక్యం ఠాకూర్ పై తీవ్ర విమర్శలు చేశారు. హనుమంతరావు ఆదివారం ఒక ప్రకటన చేస్తూ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌పై మండి పడ్డారు. పీసీసీ అధ్యక్షుడిగా రాజీనామా చేసినా అదృష్టం బాగుండి ఉత్తమ్ కుమార్‌ కొనసాగుతున్నాడని వ్యాఖ్యానించారు. అంతేగాకుండా రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుని ఎంపిక కోసం పరిశీలకుడిని ఎందుకు పంపించడం లేదని, మాణిక్కం ఠాగూర్ ఒక్కరే అభిప్రాయ సేకరణ చేస్తారా? పీసీసీ పీఠాన్ని బయట నుంచి వచ్చిన వారికి ఇస్తామంటున్నారని… అలా జరిగితే తమ ఆత్మగౌరవం దెబ్బతినదా? అని ప్రశ్నించారాయన.పీసీసీ చీఫ్ గా పార్టీలో మొదటి నుంచి ఉన్న లాయలిస్టులకు ఇవ్వాలని తాను డిమాండ్ చేశారు. దీనిపై తమ అధినేత్రి సోనియా గాంధీకి తాను లెటర్ రాశానన్నారు. కాంగ్రెస్‌లో తనను సాగనంపే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. తాను పదవుల కోసం రాజకీయాల్లోకి  రాలేదని, సాంఘిక న్యాయం కోసం తాపత్రయపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. బీజేపీలో కేంద్రనాయకులు రాష్ట్రానికి వస్తే పార్టీ కోసం కష్టపడుతున్నారని, కానీ తమ పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఫోన్ చేస్తే కూడా లిప్ట్ చేయరని తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో అధిష్టానం పార్టీని చక్కదిద్దేందుకు కఠిన నిర్ణయం తీసుకుంటుందా? హనుమంతరావు లాంటి అసంత్రుప్తులకోసం మళ్ళీ పీసీసీ చీఫ్ ప్రకటన వాయిదా వేస్తుందా? అంటే కాంగ్రెస్ ఎపుడు, ఏదైనా జరగవచ్చనే వ్యాఖ్యానాలు వినిపిస్తుండడం గమనార్హం. చూద్దాం మరి ఏమి జరుగతుందో!

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి