పర్యావరణ రహిత జీవనశైలిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి!..ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర..
జనవిజయం,14 మే(దేవిపట్నం):ప్రతి ఒక్కరూ పర్యావరణ రహిత జీవనశైలిని అలవాటు చేసుకోవాలని ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, దేవీపట్నం మండలం,దేవారం గ్రామ పంచాయతీలోని,పోతవరం గ్రామంలో జరిగింది.
ఇందుకూరుపేట ఫారెస్ట్ సెక్షన్ సిబ్బంది ఏర్పాటుచేసిన లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మీ మీ పుట్టినరోజు నాడు తప్పనిసరిగా ఒక మొక్కను నాటాలని విజ్ఞప్తి చేశారు.పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ సందర్భంగా ఇందుకూరుపేట ఫారెస్ట్ సెక్షన్ సిబ్బంది ప్రజల చేత ప్రతిజ్ఞ ఈ క్రింది విధంగా చేయించారు. పర్యావరణ పరిరక్షణ కొరకై నా దిన చర్యలలో సాధ్యమైనన్ని మార్పులు చేసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.(1) సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను ఉపయోగించనని.(2) నీటిని వృధా చేయనని ప్రతి నీటి బొట్టును సంరక్షించేందుకు ప్రయత్నం చేస్తానని.(3) మొక్కలు నాటుట,పెంచుట మరియు వాటి సంరక్షణ నా బాధ్యతగా తీసుకుంటానని.(4) పకృతి వనరులను కాపాడి, పర్యావరణమునకు మేలు చేయుటకు నా వంతు కృషి చేస్తానని.నేను అనునిత్యం నా కుటుంబమును,నా శ్రేయోభిలాషులను,నా స్నేహితులను మరియు ఇతరులను పర్యావరణ సహిత అలవాట్లు అలవర్చుకునే దిశగా ప్రేరే పిస్తానని దానికి నేను కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
ఈ కార్యక్రమంలో దేవారం గ్రామపంచాయతీ సర్పంచ్ తుర్రం రమాదేవి సాంబశివరావు,ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్,ఇందుకూరుపేట సొసైటీ మాజీ చైర్మన్ తుర్రం రామకృష్ణ దొర, పిఎంసి చైర్మన్ తుర్రం రమేష్ దొర,కారం రంగారావు దొర,కారం రాంబాబు దొర,కుంజం శ్రీనివాసు దొర,తుర్రం బాలు దొర,తెల్లం సోమన్న దొర,కారం తమ్మన దొర,తుర్రం బోసి బాబు దొర,తాటి గంగరాజు దొర,మడకం సుధీర్ దొర మరియు ఇందుకూరుపేట ఫారెస్ట్ సెక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.