చంద్రబాబు నాయుడు అర్థరాత్రి అరెస్ట్ అప్రజాస్వామికం!
….మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు…
ఖమ్మం, 09 సెప్టెంబర్(జనవిజయం): రాజ్యాంగ హక్కులను కాలారాస్తూ రాజకీయ కక్ష్య తో చంద్రబాబు పట్ల వ్యవహారించిన తీరు దుర్మార్గం అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఓ ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా తుమ్మల మాట్లాతూ., పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి గా పని చేసిన చంద్రబాబు పై అసత్యాలతో కట్టుకథలతో ఆయన ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర చేశారని, కనీస న్యాయ సూత్రాలు పాటించకుండ..మాజీ ముఖ్యమంత్రిపట్ల..అమర్యాదగా.వ్యవహరించారని,చంద్రబాబు నాయుడు అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.