చోరీ కేసులలో నిందుతుడిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ , ఖమ్మం 3 వ టౌన్ పోలీసులు
సుమారు రూ 18 లక్షల విలువగల బంగారం వెండి నగలను రికవరీ
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ విష్ణు . యస్ . వారియర్

ఖమ్మం, 01 సెప్టెంబర్( జనవిజయం) : శుక్రవారం ఉదయం సుమారు 08:30 గంటలకు సీసీఎస్ , ఖమ్మం 3 వ టౌన్ పోలీసులు ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ వద్ద వాహనాలు తనిఖీ చేయు చుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించగా అతనిని అదుపులోనికి తీసుకొని విచారించినట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్ . వారియర్ తన కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిందితుడి తో పాటు అతడి నుండి స్వాధీనం చేసుకున్న బంగారం , వెండి ఆభరణాల వివరాలు వెల్లడించారు.
నిందుతుడు వై.ఎస్.ఆర్ కాలనీ , గన్నవరం మండలం , ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఆవుల కిరణ్ కుమార్ అలియాస్ రాహుల్ , తండ్రి పేరు ( లేట్ ) మాధవయ్య 34 సంవత్సరములు , మున్నూరు కాపు , ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు . జల్సాలకు అలవాటు పడిన నిందితుడు ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నేర ప్రవృత్తి ఎంచుకొని అపార్ట్మెంట్ లలో తాళం వేసి ఉన్న ఇళ్ళల్లో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ లలో దొంగతనాలకు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు .
పోలీస్ కమిషనర్ విష్ణు యస్ . వారియర్ ఆదేశాల మేరకు నిందుతుడిని పట్టుకొని , చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న ఖమ్మం సీసీఎస్ , ఏ.సి.పి, టి . రవి , ఏసీపీ ఖమ్మం టౌన్ ఎస్.వి. హరిక్రిష్ణ , సి.ఐ లు బి. బాలాజి , బి. బాలక్రిష్ణ , ఖమ్మం 3 ఎస్.హెచ్.ఓ , బి. సత్యనారాయణ , మరియు పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు .