జనవిజయంసాహిత్యంతెలుగుకు తెగులు పట్టించొద్దు..

తెలుగుకు తెగులు పట్టించొద్దు..

నా ‘మా’ట – 7

పొద్దున్నే వాట్సాప్ తెరిచేసరికి ఇబ్బడిముబ్బడి గా మెసేజ్ లోచ్చిపడ్డాయి. చాలా రోజుల తర్వాత మిత్రుడు పంపిన మెసేజ్ ఎందుకో నన్ను ఆకర్షించింది. ఒకటికి రెండు సార్లు చదివాను. ఇటీవల కాలంలో సాహిత్యంలో అనేక ప్రక్రియలు వస్తున్నాయి. తమకున్న భాషా నైపుణ్యంతో చాలా మంది కవులు ఈ ప్రక్రియల్ని సృష్టిస్తున్నారు. ప్రచారం చేసుకుంటున్నారు. ప్రతి ప్రక్రియకూ అభిమానులు ఉంటూనే ఉన్నారు. ఇప్పుడీ మిత్రుడు కూడా ఒక సాహిత్య ప్రక్రియ సృష్టించి నాకు పంపాడు. ప్రక్రియ నిబంధనలు కూడా దాని కింద పొందుపరిచాడు. సాధారణంగా అన్ని ప్రక్రియలను చదివి వదిలేస్తుంటాను. ఆ ప్రక్రియపై సాధన చేసే సామర్ధ్యం నాకు లేదులేండి. అందుకే చదవడానికే పరిమితమవుతాను. ఎందుకో ఆ మిత్రుడు పంపిన ప్రక్రియ నచ్చింది. అంతరించిపోతున్న తెలుగు భాషను బతికించుకోవాలనేది ఆ ప్రక్రియలోని రచనా సారాంశం. అంతా బాగానే వుంది కాని ఎక్కడో తేడా కొడుతున్నట్లు అనిపించింది. సారాంశం బాగానే ఉంది. అద్భుతంగా ప్రక్రియను మలిచాడు. ఎక్కడ తేడా వస్తోందనుకుంటూ మరోసారి చదివాను. సాహిత్య ప్రక్రియలు సృష్టించే వారిలో చాలా మంది చేసే తప్పునే ఇప్పుడీ మిత్రుడూ చేశాడు. తెలుగు భాషను బతికించుకోవాలనే ఆరాటం, తపన ఉన్న సదరు మిత్రుడు ప్రక్రియ పేరు మాత్రం ఆంగ్లంలో ఉంచడం నాకెందుకో నచ్చలేదు. నిర్మొహమాటంగా చెప్పేశాను. అతనే కాదు.. ఇటీవల చాలా మంది సాహిత్య ప్రక్రియ పేరుల్ని ఆంగ్లంలోనే పెడుతున్నారు. ఆ జాబితాలో అతనూ చేరాడనిపించింది. సాహిత్య ప్రక్రియల్లోనే కాదు… సాహిత్యంలోనూ ఆంగ్లపదాలకు పెద్ద పీట వేస్తున్న కవులూ లేకపోలేదు. ఇప్పుడా ఉదాహరణలు అప్రస్తుతం. మీరూ చదివే ఉంటారు.

తెలుగు భాష మధురమైంది. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు రాయలు. వాడుక భాషలోనే కవిత్వం ఉండడానికి నాడు గురజాడ, గిడుగు రామ్మూర్తి చేసిన కృషి ఫలితంగా వ్యవహారిక భాష అయిన తెలుగులోనే అనేక కావ్యాలు వచ్చాయి. కాలం మారింది. ఇప్పుడు తెలుగులో మాట్లాడడం కనమరుగవుతోంది. కొద్దిమంది వితండ వాదుల నుండి నిజంగా మనం తెలుగు బతికించుకోవాల్సిందే. ఇక్కడొక సంఘటన మీకు గుర్తు చేస్తాను.

ఇటీవల నేను సాహితీ సమావేశానికి వెళ్లాను. అక్కడ అటు తెలుగు కోసం, ఇటు తెలుగు, ఇంగ్లీష్ కోసం పోరు చేసే పెద్దలున్నారు. చర్చ జరుగుతోంది. వినుకుంటూ నోట్స్ రాసుకుంటూ ఉన్నాను. ఒక మిత్రుడు మాత్రం చాలా ఆవేశంగా చెబుతున్నాడు. మనది ప్రజాస్వామ్యం. ఇక్కడ మెజారిటీ బై మైనార్టీ. మీకందరికీ తెలుసు. ఉపాధి కోసం మనం ఇంగ్లీషు వాడుతున్నాం. ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడే వారంతా ఎక్కువయ్యారు కాబట్టి ప్రజాస్వామ్య సూత్రం ప్రకారం మనం ఆంగ్లాన్ని సమర్ధించాల్సిందే.. అంటూ తన పాండిత్యాన్ని మొత్తం చెప్పేశాడు. మరొక అతను లేచి తన అభిప్రాయాన్ని ఇలా చెప్పేశాడు. తెలుగు మృత భాష, మాతృభాష కాదనలేం. ఇప్పుడు జీవనోపాధి కోసం ఆంగ్లాన్ని నేర్చుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. తప్పదు. అయినా తెలుగు భాషా పాండిత్యం ఓ సామాజిక వర్గానికి చెందినది. అనాధిగా వారు తమ పాండిత్యాన్ని కింద వర్గాలపై నెట్టి అణచివేసి ఎదగనీయకుండా చేశారు. ఇప్పుడా పాండిత్యాన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ తనకున్న అన్యవర్గ ధోరణిని విప్పేశాడు. చివరకు ఆ చర్చావేదిక ఏ విషయాన్నీ తీర్మానించకుండానే మధ్యలోనే ఆగిపోయింది. పైన పేర్కొన్న రెండు విషయాలూ సరికాదనిపించింది.

కరోనా కారణంగా ఉపాధి లేని మిత్రుడు పట్టణానికి చేరాడు. భవన నిర్మాణ పనికి పోతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇప్పుడంతా ఆన్లైన్ క్లాసులు కదా. ఓ ప్రయివేట్ స్కూల్ను ఆశ్రయించాడు. అప్పటికీ నేను చెప్పాను. మీ ఊరిలో ప్రభుత్వ బడిలో పిల్లలు చదివారు. ఇక్కడ ప్రయివేట్ బడికి పంపితే అంతా ఆంగ్లంలోనే ఉంటుంది. పిల్లలు చదువుతారా, వారికా సామర్ధ్యం వుందా అని అనుమానం వ్యక్తం చేశాను. నేను ఎలాగూ పై చదువులు చదవలేదు. పిల్లల్ని పెద్ద చదువులు చదివిస్తాను. ప్రభుత్వ బడుల్లో చదువు తక్కువే. ప్రయివేట్లోనే చేర్పిస్తానన్నాడు. ఆలోచించు అని నేను చెప్పినా ససేమిరా అన్నాడు. చదువుకున్న మేధావుల్ని నుండి కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరూ తెలుగును చీదరించుకుంటూ ఆంగ్ల భాషకు పట్టం కడుతున్నారు. చాలా మంది చెబుతున్నట్టు జీవనోపాధి కోసమైతే తప్పులేదు. అలాగని తెలుగుని మర్చిపోతుంటే ఎలా అన్నది నా ప్రశ్న. వాట్సాప్లో సాహిత్య ప్రక్రియ సందేశం పంపిన మిత్రుడూ ఇంగ్లీష్ బాటే. కుహనా మేధావులు కూడా ఆంగ్ల బాటే. మరో పక్క పాలకులు కూడా అంతరించిపోతున్న తెలుగును కాపాడాల్సింది పోయి వారే ఆంగ్ల భాషను ప్రోత్సహిస్తున్నారు. నేటి సమాజ దుస్థితిని కవులుగా, రచయితలుగా మనం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమించాల్సిందే.

రవి అస్తమించని సామ్రాజ్యాన్ని గడగడలాడిస్తూ సాగిన జాతీయోద్యమాన్ని వర్ణిస్తూ ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చిన కవులెంతో మంది ఉన్నారు. స్వదేశీ పాలకుల చేతుల్లో భారతమాత బందీ అయినప్పుడు కలాలను కదిలించి చైతన్యం పురిగొల్పిన రచయితలెంతో మంది ఉన్నారు. పాలకుల తప్పుడు నిర్ణయాలకు పేదలు ప్రమిదలవుతున్నప్పుడు గొంతెత్తిన వారెంతో మంది ఉన్నారు. ఇప్పుడు తెలుగు భాష మృతదశలో ఉంది. దీనికి ప్రాణవాయువును అందించి ఊపిరిపోయాల్సిన తరుణమిదే. ఆ దిశగా సాహిత్య కారులంతా సాగాల్సిన అవసరం ఉంది.

పువ్వు తను చనిపోతూ కాయను సృష్టిస్తుంది. తద్వారా తన ఉత్పత్తిని పెంచుకుంటుంది. తెలుగు భాష కూడా పువ్వు లెక్కే. ఎప్పటికప్పుడు తన పద సంపదను పెంచుకుంటూ పోతుంది. ఆ భాషలోని తీయదనం, గొప్పతనం తెలుసుకుందాం. తెలుగును బతికించుకుందాం. తెలుగు వారంతా తెలుగే మాట్లాడుదాం. కన్నెగంటి గజల్ ను పాడుకుందాం…

ఒదులుకోబోకోయి. నేస్తమా…
ఇంపుసొంపయిన తెలుగు..
మన సంస్కృతి నుదిట మెరిసే
పొద్దుపొడుపయిన తెలుగు…

– నామా పురుషోత్తం
98666 45218

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి