జనవిజయంఆంధ్రప్రదేశ్తెలుగు రాష్ట్రాలకు సున్నా చుడుతున్న కేంద్రం

తెలుగు రాష్ట్రాలకు సున్నా చుడుతున్న కేంద్రం

  • స్థానిక బిజెపి విమర్శలతో ఒరిగేదేవిూ లేదు
  • కేంద్రం చేయకుండా రాష్ట్రాలపై విమర్శలతో ప్రజలలో చులకన
  • బాధ్యతలు మరచి విమర్శలకే పరిమితమౌతున్న భాజాపా తెలంగాణ, ఏపీ నేతలు

విజయవాడ/హైదరాబాద్‌,మే21(జనవిజయం): బిజెపి నేతలు ఉభయ తెలుగు రాష్ట్రాలలో చురుకైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రయత్నించడంలో భాగంగా అధికార పక్షాలపై కొంచెం గట్టిగినే వ్యవహరిస్తున్నారు. అయితే కేవలం విమర్శలకే పరిమితం కావడంతో ఇటీవలి ఎన్నికల్లో ఈ పార్టీకి రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు గట్టివాతనే పెట్టారు. ఈ క్రమంలో కేంద్రంతో కొట్లాడి రాష్ట్రాలకు మేలు చేయడంలో స్థానిక భాజపా నేతలు పూర్తిగా విఫలమయ్యారు. కేవలం విమర్శలకు పరిమితం కావడం ప్రజలు కూడా జీర్ణించుకోవడం లేదని గుర్తించడం లేదు. దీనికితోడు ఇక్కడి నేతలు కేంద్రంలో గట్టిగా మాట్లాడే సత్తా ఉన్నవారు కాదు.

ఇటీవలి ఉప ఎన్నిక ఫలితంతో పాటు, మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో బిజెపికి పెద్ద భవిష్యత్తు లేదన్న ప్రగాఢ విశ్వాసంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఉన్నారు. ఆ పార్టీతో లేదా కాంగ్రెస్‌తో తనకు ఎలాంటి భయం లేదన్న ధీమాలో ఉన్నారు. అందుకే వారు లేవనెత్తే అంశాలను పైకి కొట్టి పారేస్తున్నారు. అంశం ఏదైనా వారికి విమర్శించడానికి సబ్జెక్ట్‌ లేదన్న ధోరణిలో టిఆర్‌ఎస్‌ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. పంట కొనుగోళ్లు, పోతిరెడ్డిపాడు, నియంత్రిత పంట విధానంలో కాంగ్రెస్‌ ,బిజెపిలను టిఆర్‌ఎస్‌ నేతలు చులకన చేసి మాట్లాడుతున్నారు. కరోనా పరిస్థితి మొదలైనప్పటినుంచి కెసిఆర్‌ తగిన ఆర్థిక సహాయం కోసం కేంద్రాన్ని అభ్యర్థిస్తూ వచ్చారు. గతేడాది రుణసేకరణ పరిమితిని పెంచేందుకు షరతులు పెట్టడంపై కెసిఆర్‌కు మంటపుట్టింది. అందుకే దిక్కుమాలిన ప్యాకేజీ అంటూ విమర్శలకు దిగారు. అయినా ఏదో ఒక నెపంతో మళ్ళీ కేసీయార్ మోడీకి తలొగ్గే ఉంటారన్న ఆరోపణలున్నాయి. నిన్నటి ఆయుష్మాన్ భవ లో చేరడంలో యూటర్న్ విషయంలోనూ ఆయన వైఖరి అలాగే ఉంది. కేంద్రంతో ఖచ్చితంగా పోరడాలన్న సంకల్పం కేసీయార్ కూ, కాంగ్రెస్ బలపడకుండా ఉంటే చాలన్న వైఖరి కేంద్రంలోని భాజపాకు ఉంది. స్థానిక భాజపా నేతలకు కేంద్రాన్ని కాదని వ్యవహరించే సీన్ ఎలాగూ లేదు కనుక కేసీయార్ కూడా కేంద్రం పట్ల ద్వంద్వ వైఖరిని మొత్తంగా కేంద్రానికి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. కేసీయార్ ఎందుకంతలా భయపడుతున్నారన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

ఎపిలో జగన్‌ మాత్రం అలాంటిదేవిూ చేయలేదు. మరోమారు కేంద్రాన్ని సూటిగా విమర్శించడానికి ఆయన సాహసించే పరిస్థితిలో లేరు. మొత్తంగా కేంద్రంతో సఖ్యతతో ఉన్నా లాభం లేదన్న విషయం కెసిఆర్‌కు,జగన్‌కు ఎప్పుడో అవగతమయ్యిందని గుర్తించాలి. దేశంలో అమలవుతున్న జాతీయ టీకా విధానం రాష్ట్రాల్లో సరిగా అమలు కావడం లేదు. కరోనా టీకా విషయంలో ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితి కల్పించారు. టీకాకు వివిధ రేట్లు నిర్ణయించడం ,ఓట్ల వేటలో భాగంగా సంక్షేమం పేరు చెప్పి వేలాదికోట్ల రూపాయలు తగలేస్తున్న ప్రభుత్వాలకు ప్రజల ప్రాణాలు కాపాడటంకంటే మించిన సంక్షేమం ఉండదని తెలియడం లేదు. టీకా సరఫరా, విక్రయంపై కేంద్ర ప్రభుత్వ పెత్తనం కారణంగా రాష్ట్రాలకు అధికారం లేకుండా పోయింది. దీంతో రాష్ట్రాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఇక్కడి ఈ సమస్యను బిజెపి నేతలు కేంద్రానికి వివరించే ధైర్యం చేయడం లేదు. విదేశీ టీకాలను సకాలంలో అనుమతించడం లేదు. స్వదేశీ తయారీదారులకు ఉత్పత్తి పెంచడానికి ఆర్థిక సహాయం కూడా చేయడం లేదు. పద్దెనిమిదేళ్లు నిండిన వారికి కూడా మే 1వ తేదీ నుంచి టీకాలు ఇస్తామని ప్రకటించిన కేందప్రభుత్వం ఇప్పుడు ముఖం చాటేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల కొరతతో తమ బాధ్యత నుంచి తప్పుకొంటున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు సొంతంగా టీకాలు కొనుగోలు చేసుకోవచ్చని ప్రకటించిన కేందప్రభుత్వం అక్కడ కూడా మెలికపెట్టింది. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి టీకా వేయించుకోవాలనుకున్న వారు కూడా కోవిన్ లో తమ పేరు రిజిస్టర్‌ చేయించుకోవాలన్న నిబంధన పెట్టారు. కరోనా బారిన పడుతున్నవారు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం లేక ప్రైవేటు ఆస్పత్రులో చేరి లక్షల కొద్దీ బిల్లులు చెల్లిస్తున్నారు. ఒక్కొక్కరు కనీసం రెండు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకూ చెల్లించాల్సిన పరిస్థితి. అయినా ప్రాణాలతో బతికి బయటపడతారన్న గ్యారంటీ లేదు. ఈ పరిస్తితుల్లో బిజెపి నేతలు విమర్శలకు పరిమితం అయ్యారు. ఇది కూడా ప్రజల్లో వారిపట్ల వ్యతిరేకతను పెంచుతోంది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి