జనవిజయంఆంధ్రప్రదేశ్తెలుగు రాష్ట్రాలపై తౌటే తుఫాన్‌ ప్రభావం

తెలుగు రాష్ట్రాలపై తౌటే తుఫాన్‌ ప్రభావం

తెలుగు రాష్ట్రాలపై తౌటే తుఫాన్‌ ప్రభావం
ఇరు రాష్ట్రాల్లో భారీ వర్షాల నమోదు
హైదరాబాద్‌/విజయవాడ,మే17(జనవిజయం): దేశంలోని పలు ప్రాంతాలతో పాటు, తెలుగు రాష్ట్రాలపైనా తౌటే తుఫాన్‌ ప్రభావం కనిపిస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్‌ అత్యంత తీవ్రంగా మారి.. ముంబైకి దక్షిణ నైరుతి దిశగా 320 కిలోవిూటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. 24 గంటల్లో తుఫాన్‌ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని వాతావారణ శాఖ అధికారులు హెచ్చరించారు. రేపటి వరకూ భారీ వర్షాలు కురుస్తాయని సూచించారు. తుఫాన్‌ ఉత్తర వాయువ్య దిశగా పయనించి 2021, మే 17వ తేదీ సోమవారం సాయంత్రానికి గుజరాత్‌ తీరాన్ని తాకుతుందని.. మంగళవారం ఉదయం పోర్‌బందర్‌, మహువా మధ్య తీరం దాటే అవకాశముందని ఐఎండీ తెలిపింది. తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణశాఖ డైరెక్టర్‌ నాగరత్నం చెప్పారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందన్నారు. మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను ప్రభావం పశ్చిమ తీరంపై ఎక్కువగా ఉంటుందన్నారు. ఏపీ కోస్తా ప్రాంతంలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో ఈదురుగాలులు, ఉరుములతో వర్షాలు కురిసే అవకాశముంది. తౌటే తుపాను ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇక రాజధాని హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రచండ భానుడి ప్రతాపంతో అల్లాడుతున్న హైదరాబాద్‌ నగర వాసులు.. సాయంత్రం కురిసిన వానతో ఉపశమనం పొందారు. హైదరాబాద్‌ శివారు శేర్లింగంపల్లిలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఈదురుగాలుల బీభత్సానికి విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అకాల వర్షాలతో మామిడి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆంధప్రదేశ్‌లో తక్కువ ఎత్తులో ఆగ్నేయ గాలులు ప్రస్తుతం వీస్తున్నాయని తెలిపారు. ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో గంటకి 30 నుంచి 40 కిలోవిూటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉరుము, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాయలసీమలోనూ మోస్తరు వర్షాలే కురుస్తాయని తెలిపారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి