Friday, March 29, 2024
HomeUncategorizedతెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ 9 రాష్ట్ర మహాసభలను (స్వర్ణోత్సవ సంవత్సర) విజయవంతం చేయండి!

తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ 9 రాష్ట్ర మహాసభలను (స్వర్ణోత్సవ సంవత్సర) విజయవంతం చేయండి!

బీడీ పరిశ్రమలో గల ప్రతి హక్కు  యూనియన్ పోరాడి సాధించింది

 

 

తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ 9 రాష్ట్ర మహాసభలను (స్వర్ణోత్సవ సంవత్సర) విజయవంతం చేయండి!

 

మార్చి 12(జనవిజయం)

ఈ రోజు ధర్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ ప్రగశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ లో 2023 మార్చి 13, 14 తేదీల్లో నిజాంబాద్ లో జరిగే తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా ఉపాధ్యక్షురాలు వి పద్మ, జిల్లా నాయకులు వి బాలయ్య కార్మికులను కోరారు. ఈ సందర్భంగా వారు వాలు పోస్టర్లను ఆవిష్కరించారు.

        అనంతరం వి పద్మ మాట్లాడుతూ., బీడీ పరిశ్రమలో అనాధారణకు గురై తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయపు చీకట్లో కొట్టుమిట్టాడుతున్న బీడీ ప్యాకర్లకు వెలుగు చూపేందుకు 1972 డిసెంబర్ 10న ఉద్భవించింది జిల్లా బీడీ వర్కర్స్ యూనియన్ అని, యజమానులు మరియు సర్కార్ నుండి దాడులను భరించి నిలబడిందని, కొద్దికాలంలోనే పలు జిల్లాలకు విస్తరించిందని తెలిపారు. మొదట్లో ప్యాకర్లు మాత్రమే యూనియన్ లో సభ్యులుగా ఉన్నప్పటికీ యూనియన్ సమరశీల పోరాటాలతో స్ఫూర్తి పొందిన ఇతర అన్ని రకాల కేటగిరీల కార్మికులు సభ్యులుగా చేరారని, యూనియన్ ను తిరుగులేని శక్తిగా మలిచారని, ప్రావిడెంట్ ఫండ్ , బోనస్ గ్రాట్యూటీ, కరువు భత్యం , కనీస వేతనాలు , జాతీయ మరియు పండుగ సెలవుల వేతనంలతో పాటు వేతన పెంపుదల ఒప్పందాలకై పోరాడిందని పేర్కొన్నారు. బీడీ పరిశ్రమలో గల ప్రతి హక్కు  యూనియన్ పోరాడి సాధించింది అని ఆమె అన్నారు జిల్లా

       జిల్లా  నాయకులు వి బాలయ్య మాట్లాడుతూ., బీడీ పరిశ్రమ  స్వదేశీ పరిశ్రమని, దేశవ్యాప్తంగా కోటిన్నర మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి కల్పిస్తున్నదని, బీడీ పరిశ్రమ అయినప్పటికీ దీనిపై కోర్ఫా చట్టం మరియు జిఎస్టి లతో కేంద్రంలో గల బిజెపి సర్కార్ దాడి చేస్తున్నదని, తన అశ్రీతులకు కోట్లాది రూపాయలను కట్టబెడుతూ కార్మికుల నోటికాడి కూడు లాగేసే కుటీల యత్నానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ పలు రకాల ఆందోళన కార్యక్రమాలతో ఉద్యమిస్తూనే ఉన్నదని ఆయన అన్నారు. తరతరాలుగా కార్మికుల పోరాటాలు మరియు త్యాగాల కారణంగా భారత కార్మికులకు లభించిన 44 కార్మిక చట్టాల్లోని సారాన్ని తొలగించి యాజమాన్యాయానికి అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లను ప్రధాని మోడీ తెచ్చి కార్మికులకు నష్టం చేస్తున్నారన్నారు.

      ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి మార్క్స్ మహిళా సంఘం నాయకులు సునీత రేణుక పద్మ నవనీత తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments