Saturday, February 24, 2024
HomeUncategorizedతెలంగాణపై పట్టుకోసం బిజెపి యత్నం

తెలంగాణపై పట్టుకోసం బిజెపి యత్నం

  • కరీంనగర్‌లో మళ్లీ గెలుపు కోసం బండి పట్టు
  • యాత్రతో ప్రజల్లో పట్టుకు ప్రయత్నాలు

కరీంనగర్‌,ఫిబ్రవరి9(జనవిజయం):

దేశవ్యాప్తంగా ఏర్పడిన సానుకూల వాతావరణంలో భాగంగా కరీంనగర్‌లోనూ బీజేపీ పట్ల గతం కంటే మెరుగైన పరిస్థితులు ఉన్నాయని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నది. ఈ వాతావరణాన్ని మరింత సానుకూలంగా మార్చుకునేందుకు కేంద్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను కూడా ప్రజల వద్దకు చేర్చి వారు పొందుతున్న లబ్దిలో మోదీ ప్రభుత్వ వాటా కూడా ఉందనే అవగాహన కల్పించాలని భావిస్తున్నారు. నియోజకవర్గంలోని నాలుగు లక్షల హిందూ కుటుంబాలకు అయోధ్యలోని శ్రీరామ చిత్రపటాలను పంపిణీ చేయనున్నారు. గతంలో చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంతో తెలంగాణాలో బీజేపీ రూపురేఖలే మారిపోయాయి.. అదే తరహాలో కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో చేపడుతున్న ప్రజాహిత యాత్రతో నియోజకవర్గంలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించబోతోంది. రాబోయే ఎన్నికల్లో ఎంపీ సీటుతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం తథ్యం. రాష్ట్రంలో బీజేపీ పవనాలు వీస్తున్నాయి. 17 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానానికి మరోమారు లోక్‌సభపై బండి సంజయ్‌ ఆసక్తిగా ఉన్నారు. ఆయన ఇప్పటికే ప్రచారంలో బిజీగా ఉన్నారు. అలాగే యాత్రకు కూడా రంగం సిద్దం చేశారు.

మరోవైపు కాంగ్రెస్‌  ఎమ్మెల్సీ  జీవన్‌ రెడ్డి కూడా పోటీకి సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఉత్తర తెలంగాణలో కరీంనగర్‌ జిల్లాలో భాజపాకు మంచి పట్టు ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన బండి సంజయ్‌ భారీగా ఓట్లను రాబట్టారు. అదే ఉత్సాహంతో కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానంను ఓటర్ల సహకారంతో దక్కించుకోవాలని బిజెపి భావిస్తోంది. ఇక్కడ బిజెపి ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు పోటీ చేస్తారన్న ప్రచారం ఉంది.  కానీ సిట్టింగ్‌కే టిక్కెట్‌ అన్నది ఖరారు అయ్యింది. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో సమిష్టి కృషితో కరీంనగర్‌ భాజపా అభ్యర్థి బండిని మరోమారు గెలుపించుకోవాలని పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా మళ్లీ కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే భాజపా కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలపై ప్రతి ఒక్కరికి వివరించాలని బండి కార్యకర్తలకు సూచించారు. ఇదే ఎజెండాగా యాత్రకు సిద్దం అవుతున్నారు. అవినీతిరహిత పాలన భాజపా ద్వారానే సాధ్యమైందన్నారు. సంస్థాగత నిర్మాణంలోని లోపాలను సవరించుకొని కార్యకర్తలను పార్లమెంట్‌ ఎన్నికలకు సమాయత్తం చేయాలని సూచించారు.

ఉమ్మడి జిల్లాలో ఎరువుల కార్మాగారం ఏర్పాటు ప్రధాని మోదీతోనే సాధ్యమైందన్నారు. ఇదిలావుంటే కరీంనగర్‌లో మరోదఫా విజయం సాధిస్తామని బండి సంజయ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్టాల్ల్రో పట్టు సాధించాలని బీజేపీ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో బీజేపీ అత్యధిక పార్లమెంట్‌ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించింది. కరీంనగర్‌లో మళ్లీ విజయ సాధించేందుకు సిట్టింగ్‌ ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌ ప్రజాహిత యాత్ర పేరిట పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటించాలని నిర్ణయించారు. తొలి విడతలో వేములవాడ, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాలలో 119 కిలోవిూటర్ల యాత్ర చేసేందుకు ఆయన రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసుకున్నారు. 10న కొండగట్టులో ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మేడిపల్లి నుంచి సంజయ్‌ తన యాత్రను ప్రారంభించా లని నిర్ణయించుకున్నారు. 119 కిలోవిూటర్ల ఈ యాత్రను సిరిసిల్ల జిల్లా కేంద్రానికి సవిూపంలో ఉన్న తంగళ్లపల్లిలో ముగింపు సభను నిర్వహించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడేలోగానే తన యాత్రను పూర్తి చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు రోజుల చొప్పున యాత్ర ఉండేలా రూట్‌మ్యాప్‌ను ఖరారు చేసుకున్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లోని అన్ని మండలాలను చుట్టివచ్చేలా, అత్యధిక సంఖ్యలో గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలతో మమేకం కావాలని, వారి సమస్యలను అడిగితెలుసుకొని పరిష్కారానికి కార్యాచరణ రూపొందించుకోవాలని ఈ యాత్ర నిర్వహిస్తున్నారు.

కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం గ్రామాలు, పట్టణాల అభివృద్ధి కోసం వెచ్చించిన నిధులను, అలాగే కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తారు. ప్రతి గ్రామంలో ఆ గ్రామానికి అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా అందించిన నిధుల వివరాలను తెలుపుతూ ప్లెక్సీలను, హోర్డింగ్‌లను ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రావిూణ ప్రాంత ప్రజలకు కేంద్రం నుంచి వస్తున్న నిధులపై అవగాహన కల్పించనున్నారు. అన్ని మండలాలతోపాటు మున్సిపాలిటీలు కవర్‌ అయ్యేలా రూట్‌మ్యాప్‌ను రూపొందించుకుంటున్నారు. ఈనెల 10న తొలి విడత పాదయాత్రను కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో పూజలు నిర్వహించి మేడిపల్లి మండల కేంద్రం నుంచి ప్రారంభిస్తారు. అక్కడ నుంచి కొండాపూర్‌, రంగాపూర్‌, బీమారం, మన్నెగూడ, బొమ్మెన, దూలూరు, సిరికొండ, కథలాపూర్‌ గ్రామాల వరకు యాత్ర నిర్వహిస్తారు. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వాహనాల్లో వెళుతూ గ్రామాల్లో ప్రజలందరిని కలుస్తూ పాదయాత్ర నిర్వహిస్తారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో 90వేల పైచిలుకు మెజారితో గెలుచుకున్న కరీంనగర్‌ స్థానంలో ఈసారి భారీ మెజార్టీని సాధించి బీజేపీ కంచుకోటగా మార్చుకోవాలని భావిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments